యస్..కన్నడ బ్యూటి రష్మిక మందన్నా..జాక్ పాట్ కొట్టిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ..సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తన లోని టాలెంట్ ని బయట పెడుతూ..మంచి మంచి ఆఫర్స్ పట్టేస్తూ..టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది. ఛలో సినిమా లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ… ఆ తరువాత విజయ్ తో..”గీతగోవిందం”..మహేశ్ బాబు తో “సరిలేరు నీకెవ్వరు”..లాంటి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెప్పించి..పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యింది ఈ కన్నడ సోయగం. అల్లు అర్జున్ తో కలిసి..”నా సామీ నా సామీ” అంటూ నడుమును వయ్యారంగా తిప్పుతూ ..కుర్రాళ్ళను ఫిదా చేసింది. ఈ ఒక్క సినిమా తో అమ్మడు కి బోలెడు ఆఫర్స్ వరించాయి. ఇప్పుడు రష్మిక మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఓ వైపు తెలుగు లో సినిమాలు చేస్తూనే.. మరో వైపు తమిళంలోను..అలాగే హిందీలోను సినిమా అవకాశాలు పట్టేసింది.
ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ – వంశీ పైడిపల్లి కాంబోలో ఓ సినిమా చేస్తున్న రష్మిక..బాలీవుడ్ లో నాలుగు ప్రాజెక్ట్ లకు కమిట్ అయ్యింది. ఇక తెలుగులో ను మూడు ప్రాజెక్ట్ లు చేస్తూ..కెరీర్ ని స్పీడ్ మీద ఉంచిన రష్మిక కు మరో బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మిక ను ఏరి కోరి సెలక్ట్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్ సల్మాన్ ఏ సౌత్ హీరోయిన్ కి ఇవ్వలేదట. ఫస్ట్ టైం అలాంటి ఆఫర్ అందుకున్న హీరోయిన్ ఈ రష్మిక అంటూ బాలీవుడ్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ “నో ఎంట్రీ” సినిమా సీక్వెల్ లో రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సౌత్ లో ఇంత మంది హాట్ భామలు ఉండగా..సల్మాన్ , రష్మిక నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో అంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.