వరంగల్‌కు చెందిన కొండా మురళీ జీవిత చరిత్ర ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కొండా సినిమా తెరకెక్కించారు. సినిమాకు ముందు భారీ అంచనాలతో పాటు భారీ ఎత్తున ప్రమోషన్లు, ప్రి రిలీజ్ ఈవెంట్లు చేశారు. కొండా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఏదైనా సంచలనం క్రియేట్ చేస్తుందా ? అని చాలా మంది ఆశించారు. మరి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఈ సినిమా కథలోకి వెళితే తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన కొండా ( త్రిగుణ్ ) యువతను ప్రభావితం చేస్తూ యువతలో దూసుకు పోతూ ఉంటాడు. కొండారు తీరును చూసి నక్సలైట్లు అతడిని దళంలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే నల్లా సుధాకర్ ( పృథ్వి) కొండాని తన పార్టీలో చేరమని కోరతాడు. కొండా ఆ పార్టీలో చేరాక తనను ఓ పావుగా వాడుకుంటున్నారన్న విషయం తెలుసుకుని నల్లా సుధాకర్‌కు దూరంగా ఉంటాడు. దీంతో కొండాని ఎలాగైనా చంపించాలని సుధాకర్ ప్లాన్ చేస్తాడు. సుధాకర్ ట్రాప్ నుంచి కొండా ఎలా తప్పించుకున్నాడు ? చివరకు అతడు రాజకీయ శక్తిగా ఎలా ? ఎదిగాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
కొండా పాత్రలో త్రిగుణ్ బాగా చేశాడు. వర్మ సినిమాల్లో నిజ జీవిత ఘటనల్లో ఉన్నట్టుగానే క్యాస్టింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసుకుంటారు. వారి నుంచి మంచి నటన కూడా రాబడతాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కొండా రోల్ చేసిన త్రిగుణ్ డీసెంట్ లుక్స్‌తో మంచి యాట్యిట్యూడ్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రలో జీవించేసింది. పర్టిక్యులర్‌గా ఆమెపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఆమె ఆకట్టుకుంది.
ఇక మెయిన్ కాస్టింగ్‌ను పక్కన పెట్టేస్తే మిగిలిన నటుల విషయంలో మరీ తక్కువ క్వాలిటీ నిర్ణయాలు, చీప్ టేకింగ్‌తో సినిమాను చుట్టేశాడు. కొండా జీవితంలో ఎన్నో బలమైన ఎమోషన్లు ఉన్నా కూడా వర్మను వాటిని సినిమాలో సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. సెకండాఫ్‌లో కొండా పాత్ర ఎటు పోతుందో తెలియదు. ఇక సినిమాలో వర్మ మార్క్ ఓవర్ బిల్డప్‌లు, ఎమోషన్లు మిస్ అవ్వడం చివరకు కొండా ఫ్యాన్స్‌ను కూడా బాగా డిజప్పాయింట్ చేసింది.
ఇక వర్మ గత బయోపిక్‌లు, గత సినిమాల్లో చూసిన టేకింగే ఈ కొండా సినిమాలో కనిపిస్తుందే తప్పా కొత్తగా ఎక్కడా ట్రీట్‌మెంట్ కనపడదు. ఇక సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్నట్టు కూడా అనిపించదు. ఏదేమైనా వర్మ తన సిల్లీ టేకింగ్, నెరేషన్‌తో కొండా దంపతలను నిండా ముంచేశాడనే చెప్పాలి.