పూరి జగన్నాథ్ – చార్మీ బంధం గురించి గత నాలుగైదేళ్లుగా టాలీవుడ్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. సరే ఎవరు ఏమనుకున్నా పూరికి చార్మీ ఆయన సినిమాలు, నిర్మాణ వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తోంది. వాస్తవానికి పూరి ప్లాపుల్లో ఉన్నప్పుడు ఆయన్ను స్టార్ హీరోలే దగ్గరకు రానివ్వలేదు. అయినా కూడా చార్మీ కష్టాల్లో కూడా పూరి వెంటే ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో ఎట్టకేలకు పూరికి పూర్వవైభవం వచ్చింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ క్రేజీ ప్రాజెక్టులో కరణ్ జోహార్ కూడా ఎంటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ లైగర్ వెంటనే అదే విజయ్ దేవరకొండతో జనగణమన ప్రాజెక్టును కూడా ఎనౌన్స్ చేసేశారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు.
సరే ఎవరెన్ని అనుకున్నా కూడా పూరి చార్మీని కలిసే ఉంటున్నారు. వీళ్లిద్దరు ఒకరిని మరొకరు వదులుకోలేనంత బంధంలో మునిగిపోయారు. దీనిపై అందరికి అభిప్రాయం ఉన్నా ఇండస్ట్రీ వాళ్లు ఎవ్వరూ ఓపెన్ అవ్వలేదు. తాజాగా పూరి తనయుడు ఆకాశ్ పూరి నటించిన చోర్బజార్ సినిమా ఫంక్షన్లో నిర్మాత బండ్ల గణేష్ దీనిపై ఓపెన్ అయిపోయాడు. పూరి భార్య లావణ్యను కుంతీదేవి, సీతాదేవితో పోల్చాడు.
పూరి దగ్గర వంద రూపాయలు లేనప్పుడు కూడా భార్య లావణ్య వచ్చిందని.. పెద్ద డైరెక్టర్ అయ్యాక ర్యాంప్, వ్యాంప్లు వచ్చారని అన్నాడు. బండ్ల ఖచ్చితంగా ఆ వ్యాంప్, ర్యాంప్ అన్నది చార్మీనే అని అందరూ చర్చించుకుంటున్నారు. చివరకు బండ్లకు కూడా ఈ బంధం నచ్చినట్టుగా లేదు.. అందుకే తెగించేసి మరీ పూరి పర్సనల్ వ్యవహారాలను కూడా వాళ్ల ఫ్యామిలీతో పాటు పబ్లిక్ ఫంక్షన్లోనే వాగేశాడు.
ఇక సీనియర్ డైరెక్టర్గా ఉండి.. ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కాలక్షేపం చేస్తోన్న గీతాకృష్ణ సైతం పూరికి చార్మీ సెటప్ అని ఓపెన్ అయిపోయారు. అదేం తప్పేం కాదని.. పూరి భార్యకు రెండు రోజులు.. ఇటు చార్మీకి రెండు రోజులు కాల్షీట్లు ఇస్తున్నారని.. చాలా మంది భార్యలకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని… పూరి అలా చేయకుండా అటు భార్య బంధానికి విలువ ఇస్తూనే ఇటు చార్మీని సెటప్గా పెట్టుకున్నారని అనడం విశేషం. ఏదేమైనా వీరి బంధంపై సినీ సెలబ్రిటీలు ఇలా ఓపెన్ అయిపోతున్నారు.