అబ్బ బాహుబలి దెబ్బతో మన యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమా అయ్యే ఉండాలన్నట్టుగా బజ్ వచ్చేసింది. బాహుబలి 1,2 సినిమాలు ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను చేసేశాయి. అసలు బాలీవుడ్ బడా ఖాన్‌లో ప్రభాస్ క్రేజ్ దెబ్బకు బిత్తరపోయిన పరిస్థితి. బాహుబలి క్రేజ్ వాడుకుంటూనే ప్రభాస్ సాహో సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేశారు.
విచిత్రం ఏంటంటే సాహో టాలీవుడ్లో సేఫ్ వెంచర్ కాకపోయినా బాలీవుడ్‌లో ఏకంగా రు. 150 కోట్లు కొల్లగొట్టేసింది. ఈ సినిమా నార్త్ వసూళ్లు చూసి ఇండియన్ సినిమా వర్గాలకు మతులు పోయాయి. తర్వాత రాధేశ్యామ్‌ను సైతం అంతే భారీగా పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కథ ప్రభాస్ రేంజ్‌కు తగినట్టుగా కూడా లేదన్న విమర్శలే వచ్చాయి.
ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ చేతిలో వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్‌తో పాటు మారుతి సినిమాలను వరుసగా లైన్లో పెట్టాడు. ఇక కేజీయఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో దుమ్ము రేపిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో సలార్ సినిమా వస్తోంది. భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఫ్యీజులు ఎగిరే అప్డేట్ వచ్చేసింది. కరోనా లేకపోయి ఉండి.. కేజీయఫ్ 2 గతేడాది రిలీజ్ అయ్యి ఉంటే సలార్ ఈ యేడాది ఖచ్చితంగా థియేటర్లలోకి వచ్చేసి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితుల మారడంతో సలార్ షూటింగ్ లేట్ అయ్యింది. ఈ సినిమాను వచ్చే యేడాది అంటే 2023 ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.
అంటే వచ్చే సమ్మర్లో సినిమా క్లిక్ అయితే చాలు త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2 రేంజ్‌లో థియేటర్లలో ప్రభాస్ తుఫాన్ రేపుతాడు అన్నమాట. శృతీహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.