టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతోంది. ఎన్టీఆర్ కెరీర్లో 29వ సినిమాగా వచ్చిన త్రిబుల్ ఆర్ హిట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా కొరటాల శివ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రాబోతోంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అటు హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై కేజీయఫ్ నిర్మాతలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని నిర్మాతలు, మేకర్స్ డిసైడ్ అయినట్టు ఓ టాక్ బయటకు వచ్చింది. అసుర / అసురుడు ఈ రెండు టైటిల్స్‌లో ఒక టైటిల్ ఈ సినిమా టైటిల్‌గా ఫిక్స్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.
అసుల అంటే టైటిల్లోనే పవర్ ఫుల్‌గా ఉంది. మొత్తానికి టైటిల్‌తోనే చాలా పవర్ ఫుల్ చూపించిన ప్రశాంత్ నీల్ రేపు కథను ఇంకెంత పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేస్తాడో ? అని అందరూ ఆసక్తితో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం తనకు వచ్చిన ఓ ఆలోచనే ఈ సినిమా కథ అని.. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ కథను తాను పక్కన పెట్టేశానని.. చెప్పాడు.
ఇక ప్రస్తుతం కేజీయఫ్ 2 సక్సెస్‌తో ఉన్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. తన అభిమాన హీరోను ప్రశాంత్ నీల్ ఎలా ? చూపించబోతున్నాడు అన్న ఉత్సుకత అయితే అందరిలోనూ ఉంది. కేజీయఫ్ 2 ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రు. 1200 కోట్ల వసూళ్లతో పాటు 390 థియేటర్లలో 50 రోజులు ఆడింది. ఈ క్రమంలోనే తర్వాత వస్తోన్న సలార్, ఎన్టీఆర్ ప్రాజెక్టులపై సైతం పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి.