దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమా తొలి రోజే వరల్డ్ వైడ్‌గా వసూళ్లలో రికార్డులు బ్రేక్ చేసింది. టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమా 2022లో ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించిన టాప్ సినిమాల్లో కేజీయఫ్ 2తో పాటు నిలిచింది.
త్రిబుల్ ఆర్ వచ్చిన రెండు వారాలకే యశ్ నటించిన కేజీయఫ్ 2 థియేటర్లలోకి వచ్చినా కూడా త్రిబుల్ ఆర్ డీసెంట్‌గా వసూళ్లు సాధించింది. త్రిబుల్ ఇండియన్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలు చూశాక త్రిబుల్ ఆర్ వరల్డ్ వైడ్‌గా రు. 1150. 10 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 613 కోట్ల షేర్ రాబట్టింది.
బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్‌లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టడం.. అది కూడా కరోనా తర్వాత అంటే మామూలు విషయం కాదు. ఆ రికార్డ్ ఒక్క త్రిబుల్ ఆర్‌కే సొంతమైంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో ఎవ్వరికి సాధ్యం కాని రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అసలు ఈ రికార్డ్ పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్లు కొట్టిన సౌత్ ఇండియన్ హీరోలకు కూడా సొంతం కాలేదు.
త్రిబుల్ ఆర్‌లోనే ఉన్న చెర్రీ, పుష్పతో బన్నీ, కేజీయఫ్ 2తో యశ్, బాహుబలితో ప్రభాస్‌కే సాధ్యం కాని రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఖాతాలో పడింది. ఎన్టీఆర్ తన తొలి పాన్ ఇండియా మూవీతో హిందీలో రు. 300 కోట్ల వసూళ్లు రాబట్టిన హిందీ డెబ్యూ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రు. 326 కోట్లు కొల్లగొట్టింది. ప్రభాస్ బాహుబలి 1 అక్కడ రు. 150 కోట్లు రాబట్టింది.
యశ్ ఫస్ట్ సినిమా కేజీయఫ్ రు. 45 కోట్లు రాబట్టింది. బన్నీ పుష్ప రు. 100 కోట్లు కొల్లగొడితే…. చెర్రీ డెబ్యూ మూవీ జంజీర్ అక్కడ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇలా ఈ సౌత్ ఇండియన్ క్రేజీ హీరోల డెబ్యూ మూవీలతో పోలిస్తే ఎన్టీఆర్ తన డెబ్యూ మూవీ త్రిబుల్ ఆర్‌తోనే ఏకంగా ఎవ్వరికి అందనంత ఎత్తులో రు. 326 కోట్లు రాబట్టాడు. ఈ రేర్ రికార్డ్ ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది.