Balakrishna – NTR: తెలుగుతో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ ఇప్పటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలప్పటి నుంచే ఉంది. అయితే, కాంబినేషన్స్ గురించి మాత్రం ఈ మల్టీస్టారర్ చిత్రాలు ఎప్పటికప్పుడు అభిమానుల్లో జనాలలో విపరీతమైన క్రేజ్‌ను నెలకొల్పుతుంటాయి. అంతేకాదు, అగ్ర దర్శకులు క్రేజీ కాంబినేషన్స్‌తో మల్టీస్టారర్ తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల చిత్రాల తర్వాత ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం ఎక్కువైంది.
అంతేకాదు, మనం లాంటి క్లాసికల్ హిట్ తర్వాత అటువంటి చిత్రాన్ని చేయాలని మెగా, నందమూరి, మంచు ఫ్యామిలీ హీరోలు ఆరాటపడుతున్నారు. అయితే, ఇప్పటివరకు చిరంజీవి తన మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హిట్టా – ఫ్లాపా పక్కనపెడితే మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి పూర్తి స్థాయి సినిమా చేస్తే చూడాలనుకుంటున్న మెగా అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరంది. అయితే, నందమూరి వంశంలో ఇప్పుడు క్రేజీ స్టార్స్‌గా వెలుగుతున్న సీనియర్ స్టార్ నట సింహం నందమూరి బాలకృష్ణ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి ఒకే చిత్రం అది కూడా పాన్ ఇండియా లెవల్‌లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Balakrishna – NTR: తారక్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి ప్రాజెక్ట్ మీద పెట్టే దృష్ఠి మరో లెవల్.
అంతేకాదు, మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా కనిపించాలని ఆతృతగా ఉన్నారు. మరి నందమూరి హీరోలంటే భారీ యాక్షన్ సినిమా లేదా అద్భుతమైన పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కే సినిమా గాని చేయాలి. బాలయ్య – ఎన్.టి.ఆర్‌లతో క్లాస్ చిత్రం చేస్తే జనాలకు ఏమాత్రం కిక్కుండదు. బాలయ్య కత్తి పట్టాలి, తారక్ తొడగొడితే గాల్లో సుమోలు లేవాలి..పవర్‌ఫుల్ డైలాగులుండాలి. ఇండియన్ బాక్సాఫిస్ వద్ద మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ కూడ దడదడలాడాలి.
నందమూరి హీరోలతో సినిమా చేసే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రమే. ఆయనైతేనే చరిత్రలో నిలిచే, చెప్పుకునే ఇలాంటి సినిమా తీయగలరు. పైగా తారక్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి ప్రాజెక్ట్ మీద పెట్టే దృష్ఠి మరో లెవల్. మరి ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందోగానీ, సెట్ అయితేమాత్రం హిస్టరీ అంటే మాదే అని చెప్పుకునే హిట్ గ్యారెంటీ.