నందమూరి వంశం గురించి చెప్పడానికి వందలకొద్దీ ఉదాహరణలున్నాయి. వాటిలో జూనియర్ ఎన్.టి.ఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాటిలో ఇదీ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబినేషన్ వచ్చిన సినిమా ‘సాంబ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండవ సినిమా ఇది. మొదటిది ‘అది’. ఎన్టీఆర్ ని మాస్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో నిలబెట్టిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సక్సెస్. ఇదే కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా అనగానే సాధారణంగానే ఊహించని అంచనాలుంటాయి.
సాంబ సినిమా హై యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కి భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే, తారక్ వయసుకు మించిన మెసేజ్ ఉండడంతో… సాంబ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదనే చెప్పాలి. కానీ, ఇందులో ఆయన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు మాత్రం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దెగ్గర యావరేజ్ గా నిలిచింది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న ఈ సినిమా తారక్ ఫాన్స్ కి మాత్రం చాలా స్పెషల్. సాంబ సినిమాలో హీరో, విలన్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ బాగా బాగా ఆకట్టుకున్నాయి.
అప్పటి వరకు పోషించిన వాటికంటే వెరైటీ విలనిజంని ప్రకాష్ రాజ్ అద్భుతంగా పండించాడు. కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ ఆడియన్స్‌ను బాగా నవ్వించినిద్. ఇలా మూవీలో చాలా ఎలిమెంట్స్ బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ 24 బ్లాక్ సఫారీల్లో వచ్చే సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీన్ కోసం వినాయక్ చాలా కష్టపడ్డాడు. ఇక సాంబ సినిమాకి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్లో లో ఉంటుంది. సాంబ శివ, సాంబ శివ అనే ఆర్ ఆర్ కి ఎన్టీఆర్ కత్తి పట్టుకోని నడుచుకుంటూ వస్తుంటే ఫాన్స్ థియేటర్స్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన భూమిక, జెనీలియా నటించారు. సాంబ సినిమా రిలీజై ఈ రోజుతో 18 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ #18యేర్స్ఫొర్ సంబ అనే హాష్టాగ్ తో సోషల్ మీడియా హంగామా చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా రూ. 18 కోట్లు కలెక్ట్ చేసి… 50 రోజులు 153 సెంటర్, 100 రోజులు 5 సెంటర్లలో ఆడింది. సీడెడ్ గడ్డపై ఉన్న రికార్డ్స్ అన్నీ సాంబ సినిమా బ్రేక్ చేసి, కొత్త చరిత్రను సృష్ఠించింది.