ఏంటో తెలియదు కాని గత యేడాది కాలంగా సోషల్ మీడియాలో బాలయ్య పూనకం వచ్చేసింది. యేడాదిన్నర క్రితం వరకు సోషల్ మీడియాలో బాలయ్య పోస్టులు, వార్తలు, ఫొటోలు ఏవి వచ్చినా అంతంత మాత్రం స్పందనే ఉండేది. పైగా సోషల్ మీడియాలో బాలయ్యను యాంటీగా ట్రోల్ చేసే గ్యాంగ్ ఎక్కువుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బాలయ్య జపమే కనిపిస్తుంది.
అసలు నందమూరి అభిమానో లేదా బాలయ్య అభిమానో మాత్రమే కాదు… సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు కూడా జై బాలయ్యా అంటున్నారు. ఇక ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆంధ్రా, తెలంగాణ, అమెరికా అన్న తేడా లేకుండా… మల్టీఫ్లెక్స్‌లు, సీ సెంటర్లలో సింగిల్ స్క్రీన్లు అయినా కూడా జై బాలయ్యా నినాదం కామన్ అయిపోయింది.
ఆచార్య అయినా బంగార్రాజు, సర్కారు వారిపాట, భీమ్లానాయక్ ఏ సినిమా రిలీజ్ రోజు అయినా ఆయా హీరోల అభిమానులే బెనిఫిట్ షోలు చూస్తారు. అయితే ఈ సినిమాల బెనిఫిట్ షోల్లో కూడా జై బాలయ్యా నినాదం కామన్‌గా మారింది. ఇవన్నీ ఇలా ఉంటే అఖండ సినిమా అఖండ విజయం సాధించాక ఏపీ, తెలంగాణలో పల్లెల్లో ప్రతి రోజు బాలయ్య సినిమాలను వీథి తెరపై వేసుకుని గ్రామస్తులు అంతా ఎంజాయ్ చేస్తున్నారు.
అఖండ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ సినిమాను ఏపీ, తెలంగాణలోని పల్లెల్లో రాత్రి వేళల్లో వీథి తెరల్లో వేసుకుని గ్రామస్తులంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి రెండు దశాబ్దాల క్రితం పల్లెల్లో ఎక్కువుగా ఉండేది. తర్వాత వీసీడీలు, ఇప్పుడు ఇంటర్నెట్ మయం కావడంతో ఆ సంస్కృతి క్రమక్రమంగా పోయింది. ఎవరికి వారు సొంతంగా ఇళ్లల్లో ఓటీటీల్లోనో లేదా యూట్యూబుల్లోనో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
విచిత్రం ఏంటంటే అటు కర్నాకటలో రాయచూర్, బళ్లారి, మాన్వి, సింధనూర్, చిక్‌మగ్‌ళూర్ తదితర ప్రాంతాల్లో పల్లెల్లో కూడా ఇప్పుడు బాలయ్య పాత సినిమాలు… సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, అఖండ, సింహా, లెజెండ్ సినిమాలను రాత్రి వేళల్లో వీథి తెరల్లో వేసుకుని గ్రామస్తులు అంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సీమలో కొన్ని పట్టణాల్లో ఆదివారాల్లో థియేటర్లలో బాలయ్య పాత హిట్ సినిమాలను అభిమానులు వేసుకుని చూస్తూ ఎంజాయ్ చేయడం ఓ ట్రెండింగ్‌గా మారింది. ఏదేమైనా బాలయ్య తనకంటూ ఓ కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు.