MoviesNBK 108: కథ లీక్... బాలయ్యను వెన్నుపోటు పొడిచే పాత్రలో తెలుగు...

NBK 108: కథ లీక్… బాలయ్యను వెన్నుపోటు పొడిచే పాత్రలో తెలుగు హీరోయిన్..?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్, బాలయ్య స్టైల్ పర్ఫార్మెన్స్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా కంప్లీట్ అయింది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి బాలయ్య బర్త్ డే సందర్భంగా మాసీవ్ అప్‌డేట్ రాబోతోంది. టీజర్‌ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. అనిల్ రావిపూడి అంటే కమర్షియల్ అంశాలకంటే కూడా ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ, బాలయ్య కామెడీ కంటే కూడా యాక్షన్ చేస్తేనే, పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్తేనే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. అందుకే, తన మార్క్ వదిలేసి బాలయ్య మార్క్ సినిమానే తీయబోతున్నాడు అనీల్ రావిపూడి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య 108వ సినిమా కథ తండ్రి, కూతురు చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీలా కూతురిగా నటిస్తుంది. బాలయ్యకు జోడిగా ప్రియమని నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఎంబీకే 108 గురించి బయటకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి కూడా నటిస్తోందట. ఓ కీ రోల్ కోసం మేకర్స్ అంజలిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ కావడంతో తను కూడా ఆమె ఓకే చెప్పిందని టాక్.

వకీల్ సాబ్ సినిమాలో అంజలి పోషించిన జరీనా పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలోనూ అవకాశం దక్కగా ఇందులో అంజలి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట. బాలయ్య పక్కన ఉంటూనే ఆయనకు వెన్ను పోటు పొడిచే విధంగా అంజలి రోల్ ను అనిల్ రావిపూడి డిజైన్ చేశాడట‌.

సినిమాకే ఆమె రోల్ ఒక హైలైట్ గా నిలవనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అంజలి గతంలో బాలకృష్ణతో డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యావరేజ్ అయిన ఈ మూవీ అంజలికి మంచి పేరే తెచ్చింది. ఇప్పుడు మరోసారి అంజలి బాలయ్య పక్కన, అది కూడా నెగటివ్ రోల్ లో కనిపిస్తుందంటే..ఖచ్చితంగా అది అంజలి కెరియర్ కి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news