నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ తర్వాత మామూలు జోష్‌లో లేడు. ప్రస్తుతం వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు చేసుకుపోతున్నాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తోన్న బాలయ్య.. ఈ సినిమా పూర్తవ్వకుండానే తన 108వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ బోయపాటి శ్రీనుతో పాటు పూరి జగన్నాథ్ సినిమాలకు సైతం బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ డైరెక్షన్లో నటిస్తోన్న సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అఖండ సినిమా గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో సంచలన రికార్డులు సాధించడంతో పాటు వసూళ్ల పరంగా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటు అన్‌స్టాపబుల్ సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ 2 ను హోస్ట్ చేసేందుకు కూడా బాలయ్య రెడీ అవుతున్నాడు.
ఇక బాలయ్య 107 సినిమా షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. హైదరాబాద్ సమీప ప్రాంతాలతో పాటు ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్స్‌లో స్పీడ్‌గా ఫినిష్ చేస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ స్వరాలు అందిస్తుండగా… రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇది బాలయ్య ఫ్యాన్స్‌కు పండగ లాంటి న్యూసే అయినా.. ముందుగా ఈ సినిమాను దసరా బరిలో దింపాలని చూశారు. అయితే చిరంజీవి భోళాశంకర్‌తో పాటు మరికొన్ని సినిమాలు దసరా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరు తున్నాయి. దీంతో బాలయ్య సినిమాను డిసెంబర్‌కు మార్చినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 23న బాలయ్య సినిమా వస్తే మూడు వారాల పాటు అంటే సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు బాలయ్య సినిమాకు థియేటర్లలో కంటిన్యూ చేసే అడ్వాంటేజ్ ఉంటుంది.
సినిమాకు అఖండ రేంజ్లో టాక్ వస్తే సంక్రాంతికి కూడా ఊపేయడం ఖాయం. ఇక గతేడాది మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన మలినేనీ గోపీచంద్ ఇప్పుడు బాలయ్యనూ మాస్ అవతారంలోనే చూపించబోతున్నాడు. సినిమా చూస్తుంటే మాస్ పూనకాలు పక్కాయే..!