నేచురల్ స్టార్ నాని మార్కెట్ గత కొంత కాలంగా మరీ అంత గొప్పగా ఏం లేదు. కరోనా కష్టకాలంలో నాని చేసిన వి – టచ్ జగదీష్ రెండు సినిమాలు కూడా ఓటీటీకి వచ్చేశాయి. అప్పుడున్న పరిస్థితుల్లో అది రైట్ అయినా కమర్షియల్‌గా మాత్రం అది నాని మార్కెట్‌ను డౌన్ చేసింది. ఇక గతేడాది చివర్లో వచ్చిన శ్యామ్‌సింగ రాయ్ సినిమాతో నాని కాస్త ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సినిమాను ఏపీలో టార్గెట్ చేయడంతో టిక్కెట్ రేట్లు బాగా తగ్గించి అమ్మారు. దీంతో శ్యామ్‌సింగ రాయ్ కమర్షియల్‌గా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఐదు నెలల గ్యాప్‌లోనే నాని నటించిన అంటే సుందరానికి సినిమా విడుదలైంది. ఫస్ట్ డే రు. 3 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అయితే ఈ సినిమాకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువే. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్.. వసూళ్లు ఎలా ఉన్నా నానికి మాత్రం మంచి గిట్టుబాటే అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు వరకు నాని ఒక్కో సినిమాకు రు. 9 – 11 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
అయితే ఈ సినిమాకు కాస్త తక్కువ బడ్జెట్ అయ్యిందట. క్లాస్ సినిమా కావడంతో రెండు ఇళ్లు, అమెరికా, కేరళలో కొన్ని సీన్లలో సినిమాను లాగేశారు. ఓవరాల్‌గా బడ్జెట్ రు. 25 కోట్ల లోపే అయ్యిందని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ తక్కువ.. బిజినెస్ ఎక్కువ కావడంతో నాని కూడా రు. 15 కోట్ల లాగేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాని తర్వాత చేస్తోన్న దసరా సినిమాకు మాత్రం బడ్జెట్ ఏకంగా రు. 60 కోట్లు.
అలా అని ఆ సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదట. తన రెగ్యులర్ రెమ్యునరేషనే వసూలు చేస్తున్నట్టు టాక్ ? అంటే దీనిని బట్టి నిర్మాతలకు బడ్జెట్ తగ్గి నాలుగు రూపాయలు మిగిలితే అవి హీరో ఖాతాలోకే వెళ్లాలే కాని.. నిర్మాత ఖాతాలోకి వెళ్లకూడదు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరు హీరోలు ఇదే పద్దతి ఫాలో అవుతున్నారట.