అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి గత ఆరేడు నెలలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. సమంతతో విడిపోయాక చైతు చాలా రోజులు వార్తల్లో ఉన్నాడు. ఇక ఈ విషయం అందరూ మర్చిపోయారునుకుంటోన్న టైంలో ఇప్పుడు హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడు అంటూ గత వారం రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా అటు శోభిత, సామ్ కూడా స్పందిచారు. శోభిత అయితే తన ఫింగర్ వేలు చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి ఈ వార్తలకు కౌంటర్ ఇచ్చింది. ఇక చైతు మాత్రం తన సినిమాల్లో తాను బిజీగా ఉన్నాడు. చైతు నటించిన కొత్త సినిమా థ్యాంక్యూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో చైతు మాట్లాడాడు. చైతు ఓ కాలేజ్ స్టూడెంట్స్‌తో జరిగిన మీట్లో మాట్లాడుతూ తాను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కాలేజ్ నుంచి బయటకు వెళదామా ? ఎప్పుడు కెరీర్లో సెటిల్ అవుదామా ? ఎప్పుడు తన ప్రేమ గురించి ఇంట్లో చెపుదామా ? అంటూ వెయిట్ చేసేవాడిని అని చెప్పాడు. కాలేజ్ పూర్తయ్యి సెటిల్ అయ్యాకే తాను ప్రేమ గురించి చెప్పాలని కాలేజ్ డేస్‌లో అనుకున్నానని చెప్పాడు.
చైతు చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తే చైతు ఫస్ట్ లవర్ సమంత కాదని క్లారిటీగా తెలుస్తోంది. చైతు కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడే మరో అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పకనే చెప్పేశాడు. ఏదేమైనా చైతు తొలిప్రేమ విషయంలో పెద్ద గందరగోళానికే తెరదీశాడు. ఇక తన రెండో సినిమా హీరోయిన్ సమంతతో ఘాటైన లిప్‌లాక్ ఇచ్చి అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాడు.
ఏమాయ చేశావే వచ్చిన ఏడేళ్లకు సమంతనే పెళ్లాడిన చైతు మరో నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇక చైతు ప్రస్తుతం థ్యాంక్యు, అమీర్‌ఖాన్‌తో లాల్చద్దా సినిమాల్లో చేస్తున్నాడు.