Moviesఅత‌డి కోసం స‌ల్మాన్‌ఖాన్‌నే వ‌దులుకున్న ప‌వ‌న్ అత్త‌... ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ..!

అత‌డి కోసం స‌ల్మాన్‌ఖాన్‌నే వ‌దులుకున్న ప‌వ‌న్ అత్త‌… ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అమ్మ‌, అత్త‌, ఆంటీ పాత్ర‌ల‌తో దూసుకుపోతోంది క్యారెక్ట‌ర్ న‌టి న‌దియా. ఒక‌ప్పుడు తెలుగులో సినిమాలు చేసిన న‌దియా ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయి అక్క‌డే 20 ఏళ్లు ఉంది. ఆ త‌ర్వాత త‌మిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన నదియా అక్క‌డ నుంచి వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌తో ఇప్పుడు భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకునే న‌టిమ‌ణిగా దూసుకుపోతోంది.

న‌దియా బ్యాక్‌గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే ఆమె త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు మ‌ళ‌యాళీలు. ఆమె నాన్న ఎస్‌కె. మెయిదు ముస్లిం. అమ్మ ల‌లిత హిందువు. అయితే వీరిద్ద‌రు ప్రేమ వివాహం చేసుకున్నారు. న‌దియాకు ఓ చెల్లి కూడా ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి యాడ్స్ అంటే ఇష్ట‌ప‌డే న‌దియా ఎలాగైనా యాడ్స్‌లో న‌టించాల‌ని ఫిక్స్ అయ్యి ఏంబీయే చ‌ద‌వాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

న‌దియా ప‌దో త‌ర‌గ‌తి పూర్త‌య్యి ఇంట‌ర్‌లో ఉన్న‌ప్పుడు ప‌క్క వీథిలో ఉండే శిరీష్ గాడ్బోలేతో ప్రేమ‌లో ప‌డిపోయింది. అప్ప‌టికే చిన్న వ‌య‌స్సు ఇంట్లో చెపితే ఖ‌చ్చితంగా తిడ‌తారు. అయితే శిరీష్‌తో ప‌రిచ‌యంతో న‌దియా ల‌క్ష్యం మారిపోయింది. అత‌డికి విదేశాల్లో చ‌దువుకుని మంచి ఉద్యోగంలో స్థిర‌ప‌డాల‌న్న కోరిక బ‌లంగా ఉండేది. న‌దియా కూడా తాను అత‌డి ప్రేమ‌లో మునిగిపోవ‌డంతో అత‌డిని ప్రోత్స‌హించింది.

అయితే ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఫాజిల్ అన్న‌య్య న‌దియా తండ్రికి స్నేహితుడు కావ‌డంతో ఆయ‌న ద్వారా ఫాజిల్ మోహ‌న్‌లాల్‌తో తీసే సినిమాలో హీరోయిన్‌గా తొలి ఛాన్స్ కొట్టేసింది. నొక్కేత దూర‌త్తు క‌న్నుమ్ న‌ట్టు ఇలా తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో పాటు ఏకంగా ఉత్త‌మ న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొట్టేసింది. అక్క‌డ నుంచి వెనుదిరిగి చూసుకోని ఆమె తెలుగు, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది.

ఈ లోగా ఆమె ప్రేమికుడు శిరీష్ అమెరికాలో ఉన్న‌త ఉద్యోగం సంపాదించ‌డంతో ఇండియాకు తిరిగి వ‌చ్చి న‌దియా త‌ల్లిదండ్రుల‌ను పెళ్లికి ఒప్పించాడు. అయితే అదే టైంలో న‌దియా స్టార్ డ‌మ్ ఓ రేంజ్‌లో ఉండ‌డంతో స‌ల్మాన్‌ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అస‌లు ఇంత ల‌క్కీ ఛాన్స్‌ను ఏ హీరోయిన్ మాత్రం వ‌దులుకుంటుంది. అయితే అప్ప‌టికే న‌దియాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది.

క‌నీసం ఈ ఒక్క సినిమా చేశాక పెళ్లి చేసుకోవాల‌ని కూడా అనుకుంది. అయితే ఈ పెళ్లికి త‌న ఇంట్లో త‌ల్లిదండ్రులు అతి క‌ష్టం మీద ఒప్పుకున్నారు. పైగా పెళ్లి కోసం ఆమె ఇన్నేళ్లు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్య‌లో ఎవ‌రి ఆలోచ‌న‌లో ఎలా ? మారిపోతాయో ? అన్న భ‌యంతో వెంట‌నే న‌దియా స‌ల్మాన్ సినిమాను రిజెక్ట్ చేసింది. అలా 1988లో న‌దియా తాను ప్రేమించిన శిరీష్‌ను పెళ్లాడి అమెరికా వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news