నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 500 రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అసలు బాలయ్యకు సరైన హిట్ పడితే బాక్సాఫీస్ రికార్డులు ఎలా బ్రేక్ అవుతాయో ? ఈ సినిమాతో ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది.
భార్గవ ఆర్ట్స్ లో మంగమ్మగారిమనవడు, ముద్దులక్రిష్ణయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత బాలయ్య నటించిన హ్యాట్రిక్ సినిమా మువ్వగోపాలుడు. ఈ సినిమాతో బాలయ్య ఎన్నో సరికొత్త, సంచలన రికార్డులు క్రియేట్ చేశాడు. 1986లో ముద్దుల క్రిష్ణయ్య సినిమాతో బాలయ్య తను సృష్టించిన కోటి తొమ్మిది లక్షల మొదటివారం ఓపెనింగ్ రికార్డ్ ను తానే అధికమించాడు. ముద్దుల క్రిష్ణయ్య సినిమాకు ఫస్ట్ వీక్ 1,14,06,465/- కలెక్షన్స్ సాధించాడు.
బాలయ్య కంచుకోట అయిన సీడెడ్‌లో 11 కేంద్రాల్లో రిలీజ్ అయ్యింది. ఈ 11 కేంద్రాల్లో ఫస్ట్ వీక్ 775 ఆటలు హౌస్‌ఫుల్ అయ్యి సీమ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో ఫస్ట్ వీక్ 275 ఆటలు హౌస్‌ఫుల్ అయ్యి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం సత్యనారాయణ ఏ / సీ థియేటర్లో మొదటి 10 రోజులు 41 ఆటలకు గాను 1,87,350 వసూలు చేసింది.
నెల్లూరు సిటీలో అర్చన, కావేరిలో ఫస్ట్ వీక్ 2,48, 912 వసూలు చేసింది. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ముద్దుల క్రిష్ణయ్య 44 కేంద్రాలకు పైగా 50 రోజులు, 31 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సిటీలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1. శ్రీనివాస 35 ఎంఎం – 2. శ్యామ్ – 3. సుభాష్ – 4. అమీర్‌పేట శేష్‌మహాల్ – 5. దిల్‌సుఖ్‌నగర్ వెంకటాద్రి – 6. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్లలో 100 రోజులు ఆడింది.
ఓ హీరో నటించిన సినిమా హైదరాబాద్ జంట నగరాల్లో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అదే ఫస్ట్ టైం రికార్డ్. తర్వాత ఆ రికార్డు చాలా రోజులు నడిచింది. 2003లో మహేష్‌బాబు ఒక్కడు సినిమా 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. తర్వాత ఒక్కడు రికార్డును మరోసారి మహేష్ తన పోకిరి సినిమాతో బ్రేక్ చేశాడు.