Moviesమ‌హేష్ vs ఎన్టీఆర్‌... ఇప్పుడైనా ఎన్టీఆర్‌పై మ‌హేష్ విన్ అవుతాడా...!

మ‌హేష్ vs ఎన్టీఆర్‌… ఇప్పుడైనా ఎన్టీఆర్‌పై మ‌హేష్ విన్ అవుతాడా…!

టాలీవుడ్‌లో ఇద్ద‌రు క్రేజీ స్టార్ హీరోల మ‌ధ్య బాక్సాఫీస్ వేదిక‌గా అదిరిపోయే ఫైట్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. పైగా ఆ ఇద్ద‌రు హీరోలు త‌మ సినిమాల‌ను సంక్రాంతి రేసులో దించుతుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ మామూలుగా ఉండేలా లేదు. టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల‌లో ఎప్పుడూ లేనంత‌గా వ‌చ్చే సంక్రాంతికి బిగ్ క్లాష్ రానుంది. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మిస్తోన్న రామ్‌చ‌ర‌ణ్ 15 సినిమాతో పాటు బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా వ‌స్తోన్న చిరు 154వ సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని అంటున్నారు. చిరు అయితే సంక్రాంతికి వ‌స్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా చెప్పేశారు.

అయితే ఇప్పుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సినిమాలు కూడా సంక్రాంతికే వ‌స్తున్న‌ట్టు క‌న్‌ఫార్మ్ చేశారు. త్రిబుల్ ఆర్‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్టు కొట్టి ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఆచార్య‌తో దెబ్బ‌తిన్న కొర‌టాల క‌సితో ఈ సినిమాపై వ‌ర్క్ చేస్తున్నాడు.

 

అటు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న మ‌హేష్‌బాబు 28వ సినిమా సైతం సంక్రాంతి కానుక‌గానే రిలీజ్ కానుంది. 2023 జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. జూలై చివ‌ర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా నాలుగు నెలల్లోనే ఫినిష్ చేసేలా త్రివిక్ర‌మ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 12 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఖ‌లేజా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరి కాంబోలో సినిమా రిపీట్ అవుతోంది.

ఎన్టీఆర్ – మ‌హేష్ ఇద్ద‌రూ కూడా త‌మ సినిమాల‌ను సంక్రాంతికే వ‌దిలితే బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. 2017 ద‌స‌రాకు మ‌హేష్‌బాబు స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో స్పైడ‌ర్ ప్లాప్ అవ్వ‌గా.. జై ల‌వ‌కుశ హిట్ అయ్యింది. ఆ పోరులో ఎన్టీఆర్ మ‌హేష్‌పై కాస్త పై చేయి సాధించాడు. మ‌రి మ‌రోసారి ఈ ఇద్ద‌రు హీరోలు పోటీప‌డితే .. సంక్రాంతి వేదిక‌గా ఎవ‌రు గెలుస్తారో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news