Moviesఅభిమానులను హర్ట్ చేసిన నమ్రత..మహేశ్ సైలెన్స్ వెనుక అర్ధం ఏమిటి..?

అభిమానులను హర్ట్ చేసిన నమ్రత..మహేశ్ సైలెన్స్ వెనుక అర్ధం ఏమిటి..?

నమ్రత ఈ పేరు కు కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడంటే ఈవిడ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు భార్య గా తెలుసు కానీ..అంతకముందే నమ్రత అభిమానులకు ఓ స్టార్ హీరోయిన్ గా తెలుసు. తన నటనతో..అందంతో జనాలని మెప్పించి..బాలీవుడ్ ఏలేసిన నటి. ఒకానోక టైంలో నమ్రతకు వరుస సినిమా ఆఫర్లు రావడం..మన స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్ధితి ఏర్పడింది అంటే..ఆమె హవా అప్పట్లో ఎలా నడిచిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక వంశీ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్, నమ్రత లవ్ లో పడ్డారన్న సంగతి తెలిసిందే. వాళ్ల ప్రేమను కొన్నాళ్లు దాచి పెట్టిన ఈ లవ్ బార్డ్స్ ..సీక్రేట్ గా కలుసుకుని..మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆ తరువాత ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్ళి చేసుకుని..పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఈ జంట టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ అని చెప్పక తప్పదు. నమ్రత పెళ్లి చేసుకునే టైంకి పెద్ద హీరోయిన్. ఇప్పటికి ఆమెకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. కానీ, తాను ఇళ్లాలిగా ఉండటానికే ఇష్టపడుతా అంటూ వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తుంది.

ఇక రీసెంట్ గా నమ్రత..తన క్లోజ్ ఫ్రెండ్ స్టైలింగ్ స్టొర్ ఓపెనింగ్ ఫంక్షను వెళ్లింది. అక్కడ మీడియా తో ముచ్చటించిన ఆమె..అక్కడే ఉన్న అభిమానులు సినిమాలో రీ ఎంట్రీ గురించి ప్రస్తావించగా..ఎప్పటిలాగే నవ్వుతూ..” నన్ను తెరపై మళ్ళీ చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ప్రతి సారి నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ, నేను ఓ భార్య గా, తల్లిగా ఉండటానికే ఇష్టపడతాను. ప్రజెంట్ నేను నా ఫ్యామిలీ బాధ్యతలు చూసుకోవడంలో చాలా బిజీ గా ఉన్నాను.

నాకు అది చాలు. నేను సినిమాల పై దృష్టి పెట్టలేకపోతున్న..సారీ, ఇప్పుడే కాదు..రాబోయే రోజుల్లోను నేను సినిమాల్లో నటిస్తాను అని అనుకోవడంలేదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ఇప్పుడు కాకపోయినా మరికొన్నాళ్ల తరువాత అయిన..ఆమె రీ ఎంట్రీ ఉంటుందనుకున్న అభిమానుల ఆశల పై నీళ్లు చల్లింది నమ్రత. అయితే, నమ్రత రీ ఎంట్రీ పై మహేశ్ కూడా మాట్లాడకపోవడంతో ..ఆయనకి ఆమె మళ్లీ తెర పై కనిపించడం ఇష్టం లేదు ఏమో అనుకుంటున్నారంతా. మరి చూడాలి భవిష్యత్తులో నైన నమ్రత మనసు మార్చుకుంటుందా అని..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news