టాలీవుడ్ హీరో గా ఈశ్వర సినిమా తో కెరీర్ ప్రారంభించిన ప్రభాస్..ఇప్పుడు ఏ స్దాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక స్టార్ హీరో ప్రభాస్ నే. పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు పొందిన ఈ హీరో వరుస సినిమాలతో కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే, వ్యక్తిగతంగా మాత్రం ఓ విషయం లో వెనుక పడి ఉన్నాడు. అదే..పెళ్ళి మ్యాటర్ లో..ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చే..డార్లింగ్..పెళ్లి అనేసరికి పారిపోతున్నాడు మాట దాటేస్తున్నాడు.
దీంతో ఆయన పెళ్ళి శుభ వార్త వినాలి అని ఫ్యాన్స్ తో పాటి..సెలబ్రిటీలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం కృష్ణం రాజునే అంటూ ఓ టాక్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..ప్రభాస్ సినిమాలు చేస్తున్న టైంలో ఫస్ట్ హీరోయిన్ త్రిషను లవ్ చేశాడని..ఆమె అంటే చాలా ఇష్టమని..స్క్రీన్ పై కూడా వీళ్ళ రొమాన్స్ డటంతో ..ఇద్దరు లవ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఎవరిదారి వాళ్లది అన్నట్లు సైలెంట్ అయిపోయారు.
ఇక ఆ తరువాత అనుష్క తో ప్రభాస్ లవ్ లో ఉన్నారని..ఇద్దరికి ఇష్టపడుతున్నారంటూ సోషల్ మీడియాను షేక్ చేసే విధంగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికి అవుతున్నాయి కూడా..కానీ, వీళ్ళు ఎప్పటికప్పుడు మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఆ తరువాత కాజల్ అగర్వాల్ తో క్లోజ్ గా మూవ్ అయిన ప్రభాస్ కు ..ఆమెతో కూడా లవ్ బంధం ఉంది అంటూ వార్తలు వినిపించాయి. కొన్నాళ్ళు హాట్ టాపిక్ గా నడిచిన ఈ మ్యాటర్ ఆతరువాత సైలెంట్ అయిపోయింది. అయితే, ఈ ముగ్గురి విషయంలో కృష్ణం రాజు..ప్రభాస్ మాట వినలేదనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే ప్రభాస్ ఇప్పుడు పెళ్లి అంటే చిరాకు పదుతున్నారట. అస్సలు ప్రభాస్ పెళ్లి చేసుకునే సూచనలు కూడా కనిపించడం లేదు..అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.