గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం బుల్లోడే తర్వాత కాలంలో తెలుగు సినిమా రంగాన్ని శాసించిన సూపర్‌స్టార్ కృష్ణ అయ్యాడు. సినిమాలపై ఆసక్తితో బుర్రిపాలెం నుంచి చెన్నై వెళ్లిన కృష్ణ ముందుగా ఎన్టీఆరే కలిశారు. తర్వాత తేనెమనసులు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగు సినిమా రంగంలో మొదటి కౌబాయ్ సినిమా, తొలి 70ఎంఎం సినిమాలు నిర్మించిన ఘనత కృష్ణకే దక్కుతుంది.
కృష్ణ – విజయనిర్మల జంట వెండితెరపై ఎంతలా ఫేమస్ అయ్యిందో… నిజజీవితంలోనూ అంతే ఫేమస్. కృష్ణకు అప్పటికే ఇందిరతో పెళ్లయ్యింది. నలుగురు పిల్లలు కూడా పుట్టారు. అటు విజయనిర్మలకు పెళ్లయ్యి ముందు భర్తతో నరేష్ జన్మించాడు. అయితే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విజయనిర్మల రచయిత, దర్శకురాలు.. ఇటు నటి కూడా… ఈ క్రమంలోనే కృష్ణకు సాహచర్యంలో కృష్ణతో కలిసి హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది.
అటు కృష్ణనే పెట్టి హీరోగా ఎన్నో సినిమాలు తీసింది. ఈ క్రమంలోనే భర్తతో ఏర్పడిన విబేధాల నేపథ్యంలో భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇక కృష్ణనే తన దేవుడిగా కొలిచింది. నిజం చెప్పాలంటే కృష్ణ మొదటి భార్య ఇందిర కంటే విజయనిర్మలే ఎక్కువుగా కృష్ణ బాగోగులు చూసుకునేది. ఆమె హీరోయిన్ కావడంతో అటు షూటింగ్‌లకు కూడా వెళ్లడంతో కృష్ణకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వెంటే ఉంటూ సపర్యలు చేసేవారు. 1969లో వీరిద్దరు ఒక్కటయ్యారు.
కృష్ణను పెళ్లి చేసుకున్నాక ఈ దంపతులు పిల్లలు కావాలని అనుకోలేదు. విజయనిర్మలకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం నరేష్‌ను తన కొడుకుగా కృష్ణ చూసుకున్నారు. ఇక విజయనిర్మల తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేశాక కృష్ణను విడిచి ఉండలేకపోయింది. వీరిద్దరు గుడిలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసినా కృష్ణ అమ్మ మాత్రం విజయనిర్మలను తమ ఇంటి సవతి కోడలిగా అంగీకరించేందుకు ఇష్టపడలేదు.
ఎందుకంటే అటు ఇందిర స్వయానా ఆమెకు సొంత మేనకోడలు. కృష్ణకు మేనమామ కూతురు మొదటి భార్య ఇందిర. ఆ తర్వాత విజయనిర్మల కృష్ణను బాగా చూసుకోవడంతో ఆమెను తమ ఇంటి కోడలిగా అందరూ అంగీకరించారట. ఇక కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇందిరతో ఎక్కువుగా చనువుగా ఉండేవాడట. ఈ క్రమంలోనే విజయనిర్మలను కృష్ణ రెండో భార్యగా ఇందిర అంగీకరించేందుకు ఆదిశేషగిరిరావు ఎంతో కష్టపడ్డారట.
విజయనిర్మల మీనా సినిమాను డైరెక్ట్ చేయగా.. ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇక ఆమె 40 సినిమాలను డైరెక్ట్ చేసి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే విజయనిర్మల కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయలో ఒక్క సినిమాను కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే ఆమె సొంత బ్యానర్ విజయకృష్ణలో మాత్రం సినిమాలు తీసి డైరెక్ట్ చేశారు. ఇక విజయనిర్మల 2019లో గుండెపోటుతో మృతి చెందే వరకు కృష్ణ వెంటే ఉన్నారు.