రాజావారు రాణి వారు – ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాందిని చౌదరి హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ సినిమాతో గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రోమోలు, ట్రైలర్లతో ఆకట్టుకుంది. ఈ రోజు సినిమాకు వస్తోన్న టాక్ చూస్తుంటే ఈ సినిమా కథ చూస్తే కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. తండ్రి కష్టంతో ఎదుగుతాడు. తల్లి లేకపోవడంతో కోల్పోయిన ప్రేమను తనకు కాబోయే భార్యతో పొందాలని చూస్తుంటాడు.
తాను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనని.. తనకు కాబోయే భార్య కూడా అలాగే స్వచ్ఛంగా ఉండాలనుకుంటాడు. అయితే తాను తొలిసారిగా పెళ్లి చూపులకు వెళ్లిన శాన్వి ( చాందిని చౌదరి) తనకు నచ్చినా.. ఆమెకు అప్పటికే ఓ లవ్‌స్టోరీ ఉండడంతో వెనక్కు వచ్చేస్తాడు. తర్వాత తమకు తెలియకుండానే వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటోన్న విషయం అర్థమై చేరువ అవుతారు. అయితే పాతతరం ఆలోచనలతో ఉన్న కృష్ణకు, మోడ్రన్ అమ్మాయి శాన్వికి మధ్య గ్యాప్ తప్పదు. చివరకు వీరిద్దరు ఒక్కటయ్యారా ? లేదా ? అన్నదే ఈ సినిమా కథ.
సమ్మతమే సినిమాలో హీరో పాత్ర ఆసక్తికరంగానే అనిపిస్తుంది. తల్లిని కోల్పోయిన బాధలో స్కూల్లో చదువుతున్నప్పుడే హీరో తనకు పెళ్లి చేసేయమని హీరోను అడగడం ఆసక్తిగా ఉంటుంది. హీరోయిన్ పట్ల ముందు వ్యతిరేకత పెంచుకునే హీరో మళ్లీ వెంటనే ఆమెకు ఎందుకు ఇంప్రెస్ అయిపోతాడో అంత కన్విన్సింగ్‌గా కూడా లేదు. ఓ వైపు హీరోయిన్ ఎవ్వరితోనూ మాట్లాడకూడదు అన్న ఆంక్షలు పెడుతూ ఉండడం.
అతడి స్వభావానికి విరుద్ధంగా హీరోయిన్ ప్రవర్తించడం ఇలా ఇద్దరి మధ్య చాలా సన్నివేశాలు మొక్కుబడిగా నడుస్తూ ఉంటాయి. ఇక నటనా పరంగా కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలిస్తే మరింత బెటర్ అయ్యాడు. చాందినీ చౌదరి కలర్‌ఫోటో సినిమా తర్వాత మరింత మెప్పించే స్క్రీన్ ప్రెజెన్సీతో నటించింది. కిరణ్ – చాందిని స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. టెక్నికల్‌గా సినిమా ఓకే.
ఓవరాల్‌గా చెప్పాలంటే సమ్మతమే సినిమాలో హీరో, హీరోయిన్ల ప్రామీసింగ్ నటనతో పాటు ఫస్టాఫ్ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ నుంచే అసలు సమస్య మొదలవుతుంది. పైగా క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్ట్‌విగా లేదు. ఓవరాల్‌గా ఈ సినిమా కాన్సెఫ్ట్… కొన్ని ఎమోషన్ల కోసమే ఓ సారి చూడొచ్చు అంతే. అంతకు మించి సమ్మతమే కాదు.