ఈ తరం జనరేషన్ హీరోయిన్లలో అందంతో మాత్రమే కాకుండా అభినయంతో కూడా మెప్పించే హీరోయిన్లు ఎవరు ఉన్నారా ? అని వెతికితే ఇద్దరి పేర్లే ముందుగా కనిపిస్తాయి. అందులో ఒకటి మహానటి కీర్తి సురేష్, రెండోది సాయి పల్లవి. నటన పరంగా ఈ ఇద్దరు హీరోయిన్లకు పోటీ వచ్చే హీరోయిన్లే కనపడడం లేదు. అసలు మహానటి సినిమా చూసిన వాళ్లు అయితే ఈ తరం సావిత్రి కీర్తీయే అని కళ్లు చెమర్చారు. అసలు సావిత్రి బయోపిక్‌లో మళ్లీ సావిత్రియే దిగి వచ్చి నటించిందా ? అన్నట్టుగా కీర్తీ తన నటనతో జీవించేసింది.
ఇక గ్లామర్ డోస్‌కు ఇప్పటి వరకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి తన తాజా సినిమా సర్కారు వారి పాటతో గ్లామర్‌కు కూడా కాస్త గేట్లు ఎత్తేసినట్టే కనిపించింది. కమర్షియల్ సినిమాల్లో రాణించాలంటే ఆ మాత్రం గ్లామర్ ఒలకబోయాల్సిందే అన్న సూత్రం ఆమె బాగా వంట పట్టించుకన్నట్టుగా ఉంది. ఇక ఇటీవల ఎక్కువుగా ఓటీటీ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తోన్న కీర్తి ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమా చేస్తోన్న కీర్తి, అటు నానికి జోడీగా దసరా సినిమాలోనూ నటిస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు 2.5 కోట్ల వరకు తీసుకుంటోంది. ఇక దీంతో పాటు ఆమె సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆదాయం, ఇతర ప్రమోషన్లు, ప్రకటనలు అన్ని కలుపుకుంటే ఆమెకు నెలకు రు. కోటి వరకు వస్తోందట.
మామూలుగా అయితే కీర్తికి ఉన్న క్రేజ్‌కు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆమె తిరుగులేని బిజీ హీరోయిన్ అయిపోవాలి. పూజా హెగ్డే, రష్మిక మందన్నతో పోలిస్తే కీర్తి కాస్త వెనకపడడానికి కారణం.. ఆమె గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉండడం ఒకటి అయితే… ఎక్కువుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంతో పాటు ఓటీటీల్లో ఎక్కువుగా కనిపించడంతో వెండితెరపై ఆమెకు ఎట్రాక్షన్ తగ్గిపోతోంది.
అందుకే ఆమెతో నటించేందుకు అటు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఆమెకు సక్సెస్ రూట్ కూడా తక్కువుగా ఉంటోంది. లేకపోతే మహానటి తర్వాత కీర్తికి వచ్చిన క్రేజ్‌కు ఆమె దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఉండేవారే కాదు.