లాంగ్ గ్యాప్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమాకు ముందు నుంచే భారీ హైప్ వచ్చింది. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా… మరో స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా విక్రమ్ హిట్‌లిస్ట్ పేరుతో రిలీజ్ అయ్యింది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఇక్కడ రిలీజ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు, అనిరుధ్ మ్యూజిక్‌తో అంచనాల పరంగా ఎక్కడికో వెళ్లింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటికే తమిళనాడు, ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ప్రీమియర్ షోలతో పాటు ట్వీట్టర్ రివ్యూల ప్రకారం చూస్తే సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది.
విక్రమ్ సినిమా మూడు గంటల హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని అంటున్నారు. కనగరాజ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రాకింగ్‌గా ఉందని.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటన అద్భుతం అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఎక్సలెంట్‌గా ఉందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుంచి మనం కోరుకున్న దానికంటే చాలా ఎక్కువే ఇచ్చాడని ప్రతి ఒక్కరు అంటున్నారు.
సూర్య స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయిందని… తాము విక్రమ్ 2 కోసం ఎగ్జైట్మెంట్‌తో ఉన్నామని అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు మళ్లీ మళ్లీ చూసేలా ఉన్నాయని.. ఇటీవల కాలంలో ఈ రేంజ్ యాక్షన్ సినిమాను చూడలేదనే అంటున్నారు. యాక్షన్ అవతార్‌లో కమల్ హాసన్ అదిరిపోయే ఫర్ఫామెన్స్ ఇచ్చారని.. లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందనే అంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ బాగా వినిపిస్తోంది.