నళిని ఒకప్పటి అందాల రాశి.. ఆమె అందాలు ఆరబోస్తే చూసేందుకు కుర్రకారు ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లారు. ముఖ్యంగా శింబు తండ్రి టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమసాగరం సినిమా అటు తమిళంతో పాటు ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. తెలుగులో డబ్ అయ్యి కూడా ఈ సినిమా ఏకంగా సంవత్సరం పాటు ఆడింది. అప్పట్లో ఇదో సెన్షేషనల్. ఈ సినిమా తర్వాత నళిని కుర్రకారు అందాల దేవత అయిపోయింది.
అసలు ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత, గ్లామరిజం, రొమాన్స్ పండించడంలో మామూలుగా విజృంభించలేదు. తెలుగులో అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను.. పున్నమి వెన్నెల అనే పాట ఎంతో పెద్ద హిట్ అయ్యింది. ఆ మాటకు వస్తే ప్రేమసాగరం పాటలు అన్నీ సూపర్ హిట్టే. ఇక నళిని సంఘర్షణ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కూడా నటించింది.
ఇక నళిని అసలు పేరు రాణి. ఆమె తండ్రి వైకే. మూర్తి సినిమాల్లో కొరియోగ్రాఫర్. ఆమె స్కూల్‌కు వెళుతున్నప్పుడే తమిళంలో ఇళవేల అనే సినిమాలో నటించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. నళిని చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమసాగరం సినిమా తర్వాత ఆమె ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయిపోయింది. ఆమెకు పలు భాషల్లో సినిమాల్లో మంచి ఛాన్సులు వచ్చాయి.
పెళ్లయ్యాక కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముద్ర వేస్తూనే ఇటు బుల్లితెరపై కూడా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ చేసింది. నళిని భర్త రామరాజన్ మంచి పేరున్న దర్శకుడు. అప్పట్లో ఆయన తీసిన ఓ సూపర్ హిట్ సినిమా థియేటర్లలో ఏకంగా సంవత్సరంకు పైగానే ఆడింది. ఇదో సెన్షేషనల్ రికార్డ్.
రామరాజన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నేరుగా నళిని తల్లి వద్దకు వెళ్లి.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. అని చెప్పడంతో ఆయన్ను రక్తం వచ్చేలా కొట్టిందట నళిని తల్లి. ఆ తర్వాత నళినిని తల్లి తమిళ సినిమా పరిశ్రమ నుంచి దూరంగా మళయాళ సినీ పరిశ్రమకు తీసుకువెళ్లిందట. అదే టైంలో తెలుగు సినిమాలు చేస్తోన్న సమయంలో సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ పరిచయం కావడంతో తన ప్రేమ గురించి ఆమెతో చెప్పి బాధపడేదట.
అలా జీవితా రాజశేఖర్.. నళిని దంపతుల ప్రేమకు సాయం చేసేదట. చివరకు నళిని – రామరాజనే పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అయితే రామరాజన్ ఎక్కువుగా జాతకాలు నమ్ముతారట. ఈ క్రమంలోనే నళినితో స్పర్థలు రావడంతో విడిగా ఉన్నా మళ్లీ పిల్లల పెళ్లి సమయంలో మాత్రం కలిసిపోయారట.