Moviesజ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవిని కాద‌ని.. వాణిశ్రీయే కావాల‌న్న ఎన్టీఆర్‌.... !

జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవిని కాద‌ని.. వాణిశ్రీయే కావాల‌న్న ఎన్టీఆర్‌…. !

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ న‌టించ‌ని పాత్ర లేదు. అంతేకాదు.. క‌లిసి న‌టించ‌ని హీరోయిన్ కూడా లేదు. అయితే.. కొంత‌మందితో ఎన్టీఆర్ చేసిన పాత్ర‌లు ఆయ‌న జీవిత కాలంలో మ‌ర‌పు రాని ఘ‌ట్టాలుగా నిలిచిపోయాయి. అలాంటి వాటిలో `ఆరాధ‌న` సినిమా ఒక‌టి. ఈ సినిమాను అన్న‌గారు.. త‌న జీవితంలో కీల‌క‌మైన సినిమాగా పేర్కొన్నారు. ఈ సినిమాలో కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. బ‌హుశ అన్న‌గారు అందుకే.. ఇలా పేర్కొని ఉండొచ్చు.

ఈ సినిమాలో మొత్తం పాట‌ల‌న్నీ కూడా.. ఉత్త‌రాది గాయ‌కుడు మ‌హమ్మ‌ద్ ర‌ఫీతో పాడించారు. అంతేకా దు.. ప్ర‌తిపాట‌ను కూడాఅన్న‌గారు ఎంతో ర‌క్తిక‌ట్టించేలా న‌టించారు. వాస్త‌వానికి ఈ సినిమాకు బాల సుబ్ర‌హ్మ‌ణ్యమే పాడాల్సి ఉంది. అయితే.. అప్ప‌టికి ఏర్ప‌డిన చిన్న‌పాటివివాదాల‌తో అన్న‌గారు.. బాలును ప‌క్క‌న పెట్టారు. పైగా.. తెలుగు ప్రేక్ష‌ల‌కు.. వెరైటీ రుచి చూపించాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే స్వ‌యంగా ముంబైకి వెళ్లి ర‌ఫీని ఒప్పించారు.

అదేస‌మ‌యంలో ఈ సినిమాలో తొలుత అన్న‌గారి ప‌క్క‌న జ‌య‌ప్ర‌ద‌ను అనుకున్నారు. త‌ర్వాత‌.. శ్రీదేవి ని కూడా చ‌ర్చించారు. కానీ, అన్న‌గారు మాత్రం ఏరికోరి.. వాణిశ్రీని ఎంచుకున్నారు. ఓ సినిమా షూటింగు లో వాణిశ్రీతో ఈ క‌థ చెప్ప‌డంతో ఆమె ఎంతో భావోద్వేగానికి గుర‌య్యార‌ట‌. ఈ సంద‌ర్భంలో ఆమె ముఖంలో మారిన క‌వ‌ళిక‌లు చూసిన అన్న‌గారు.. ఈ సినిమాకు.. వాణి శ్రీ అయితేనే న్యాయం చేస్తుంద‌ని భావించి.. ప‌ట్టుబట్టి వాణిశ్రీని ఎంచుకున్నార‌ట‌.

ఇలా.. ఈ సినిమాలో అనేక విశేషాలు ఉన్నాయి.అ దేవిధంగా ఊటీ.. కొడైకెనాల్‌, శ్రీన‌గ‌ర్ వంటి టూరిస్ట్ ప్రాంతాల్లో చాలా వ‌ర‌కు పాట‌లు చిత్రీక‌రించ‌డం.. అన్న‌గారి సినిమాల్లో ఈ మూవీతోనే ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. భ‌గ్న ప్రేమికుడిగా.. అన్న‌గారు చేసిన యాక్ష‌న్‌.. ఆరాధ‌న‌ను సూప‌ర్ డూప‌ర్ హిట్ చేయ‌డం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news