Moviesఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష సూసైడ్ కి కారణం ఆ హీరోనేనా ..తెర...

ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష సూసైడ్ కి కారణం ఆ హీరోనేనా ..తెర పైకి షాకింగ్ మ్యాటర్..?

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యం బాగోలేక కొందరు..హార్ట్ అటాక్ తో కొందరు..సూసైడ్ చేసుకుని మరికొందరు..ఇలా వరుసగా స్టార్ సెలబ్రిటీలు మృతి చెందుతున్నారు. ఇలా వరుస విషాదాలు వెంటాడుతున్న టైంలోనే మరో విషాద వార్త సినీ లోకానికి తీరని శోకాని మిగిల్చింది. దేశంలోనే టాప్‌ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు అయిన ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో సినీ ఇందస్ట్రీ షాక్ కు గురైంది.

 

బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో ఆమె నిర్వహిస్తున్న బొటిక్‌లోనే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. స్నానాల గదిలో విగత జీవిగా పడి ఉన్న ప్రత్యూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు ప్రత్యూష దుస్తులు డిజైన్‌ చేశారు. దీపికా పదుకొనే, కీర్తి సురేష్‌, శృతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రియ, నిక్కీ గల్రానీ, కృతి కర్భంద, ప్రణీతతో పాటు పలువురు తారలకు డ్రెస్‌లు డిజైన్‌ చేశారు. చాలా మంది సెలబ్రిటీలకు ప్రత్యూష ఎండార్స్‌ చేశారు.

ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగ ప్రవేశం చేశారు. ప్రత్యూష సూసైడ్ లెటర్ రాసి మరణించిన్నట్లు తెలుస్తుంది. ” నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు..నాను ఎవ్వరికి భారం గా ఉండలేను,,”అంటూ రాసి ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ మృతి పై సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఈమె బాలీవుడ్ బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని..గత కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈమె సూసైడ్ చేసుకోవడం వెనుక ఆ హీరో హ్యాండ్ ఉందా..అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా..చిన్న వయసులోనే ఇలా ఆమె సూసైడ్ చేసుకోవడం పట్ల సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news