ఎస్ ఇదే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో తర్వాత సినిమా చేయలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. అన్నీ సెట్ అయ్యాయి.. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తారువాయి అనుకుంటోన్న టైంలో కథలో ఎక్కడో తేడా కొట్టేసింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నారు. ఎవరి దారులు వారు చూసుకున్నారు. మహేష్‌తో త్రివిక్రమ్ కమిట్ అయిపోయాడు. అటు ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేసుకుంటున్నాడు.
పోనీ ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అయ్యింది.. ఇటు మహేష్‌తో సినిమా సెట్ అయ్యింది.. త్రివిక్రమ్‌కు మళ్లీ స్టార్ హీరో దొరికాడనుకుంటోన్న టైంలో ఇప్పుడు ఈ సినిమా కథ కూడా తేడా కొడుతోందనే చర్చ నడుస్తోంది. మామూలుగా త్రివిక్రమ్ కథ చెప్పారంటే ఎంత పెద్ద హీరో అయినా మార్పులు, చేర్పులు చెప్పే సాహసం చేయరన్న టాకే ఇండస్ట్రీలో ఉంది.. అది నిజం కూడా.. ఇక మీడియం రేంజ్ హీరోలతో త్రివిక్రమ్ సినిమా చేస్తే అసలు ఆయన చెప్పినట్టు ఆడడమే తప్పా చిన్న ప్రశ్న కూడా వేసే ఛాన్సే ఉండదు.
అయితే ఇప్పుడు వరుసగా ఇద్దరు స్టార్ హీరోలు త్రివిక్రమ్ కథలకు అభ్యంతరం చెప్పడమే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు చర్చంతా త్రివిక్రమ్ చుట్టూనే తిరుగుతోంది. మహేష్‌బాబు సినిమా ఇంకా సెట్స్ మీదకు ఎందుకు ? వెళ్లలేదన్న ప్రశ్నకు త్రివిక్రమ్ ఇంకా ఫైనల్ స్క్రిఫ్ట్ లాక్ చేయకపోవడమే అంటున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితమే బేసిక్ ఐడియాను మహేష్ ఓకే చేశాడు.
అయితే ఫైనల్ కథ విన్నాక మహేష్‌కు ఎంత మాత్రం నచ్చలేదట. పైగా సెకండాఫ్‌లో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు నచ్చలేదని చెప్పినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు త్రివిక్రమ్‌కు సహజంగాను తానో స్టార్ డైరెక్టర్‌ను అన్న ఇది ఉంటుంది. పైగా అజ్ఞాతవాసి ప్లాస్ అయినా అరవిందసమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో తానేంటో ఫ్రూవ్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నాడు.
ఇక మహేష్ చాలా మార్పులు సూచించడంతో కూడా త్రివిక్రమ్ కాస్త ఎక్కడో హర్ట్ అయ్యాడనీ కూడా అంటున్నారు. అందుకే సర్కారు వారిపాట రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. పైగా మహేష్‌కు గతంలో త్రివిక్రమ్ రెండు సినిమాలు చేసినా రెండూ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ సారి అయినా హిట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత త్రివిక్రమ్ మీదే ఉంది. ఈ టైంలో హీరోను మెప్పించలేని కథతో ఏం చేస్తాడో ?
ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తోంది. త్రివిక్రమ్ ఇటీవల కాలంలో తాను డైరెక్ట్ చేసే సొంత సినిమాలపై కాస్త కాన్‌సంట్రేషన్ తగ్గించి తనకు సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ చేసే సినిమాల స్క్రిఫ్ట్‌లపై కాన్‌సంట్రేషన్ చేయడమే అంటున్నారు. ఓ వైపు ఓన్ ప్రొడక్షన్ హౌస్.. మరోవైపు తన సన్నిహితులకు చెందిన బ్యానర్లలోనూ ఆయనకు వాటా ఉందన్న ప్రచారం ఉంది. ఆ సినిమాల నిర్మాణాలు, ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలలకు స్క్రీన్ ప్లేలు, మాటలు, రచనా సహకారాలు ఇవ్వడాలతో అటు వైపు కాన్‌సంట్రేషన్ పెరిగి.. తాను డైరెక్ట్ చేసే సినిమాలపై ఆయన దృష్టి తగ్గిందనే అంటున్నారు.
రెండున్నరేళ్ల క్రితమే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి కూడా ఇప్పటకీ తన సొంత సినిమాను పట్టాలు ఎక్కించకపోవడానికి ఇదే కారణమంటున్నారు. మరోవైపు పవన్ సినిమాలకు పనిచేస్తున్న త్రివిక్రమ్‌కు ఈజీగా రు. 10 కోట్ల వరకు వస్తున్నాయి. ఆ సినిమాలకు అందరూ కొత్త డైరెక్టర్లే కావడంతో వాళ్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండడం లేదు. ఇటు త్రివిక్రమ్‌కు పెద్దగా పనుండడం లేదు. రెమ్యునరేషన్ బాగానే వస్తోంది. దీంతో తన సొంత సినిమాలపై దృష్టి పెట్టే టైం ఆయనకు ఉండడం లేదంటున్నారు. మరి ఇప్పటకీ అయినా త్రివిక్రమ్ సొంత సినిమాలపై దృష్టి పెట్టకపోతే పెద్ద హీరోలతో సినిమాలు అంటే ఇబ్బందులు తప్పవు మరి.. అందుకే త్రివిక్రమ్‌తో పని చేయాలనుకుంటోన్న పెద్ద హీరోలు కూడా ఇప్పుడు ఆందోళనతోనే ఉంటున్నారట.