దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు హీరో ప్రభాస్. ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ ఇమేజ్ ఎంతలా మారిపోయిందో చూశాం. ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్‌కు ఈ ఇమేజ్ ఊరుకునే రాలేదు. బాహుబలి సీరిస్ సినిమాల కోసం ఏకంగా ఐదేళ్ల పాటు తన కెరీర్ వదులుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా సౌత్‌లో నిరాశ పరిచి ఉండవచ్చు…. కానీ బాహుబలి ఇచ్చిన ఇమేజ్‌తో బాలీవుడ్‌లో ఏకంగా రు. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టేసింది.
దీంతో మార్కెట్ పరంగా ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక రీసెంట్‌గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా సైతం అంచనాలు అందుకోలేదు. రు. 400 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లతో టార్గెట్‌గా దిగిన రాధేశ్యామ్‌కు వరల్డ్ వైడ్‌గా రు. 100 కోట్ల షేర్ కూడా రాలేదు. కమర్షియల్‌గా చూస్తే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. అయినా కూడా ప్రభాస్‌కు నార్త్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లో అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉన్నాయి.
ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌తో పాటు మారుతి దర్శకత్వంలోనూ మరో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మారుతి సినిమా పక్కన పెడితే మిగిలిన మూడు సినిమాలపై ఇప్పటికే నేషనల్ లెవల్లో బజ్ వచ్చేసింది. భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషలకు చెందిన ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాయా ? అని వెయిట్ చేస్తున్నారు.
ఇక సాహో, రాధేశ్యామ్ అంచనాలు అందుకోలేకపోయినా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. రాధేశ్యామ్ సినిమాకు ప్రభాస్ రు. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక సలార్ సినిమాకు ఇది రు. 100 కోట్లకు పెంచేశాడట. సలార్ సినిమా కోసం గాను నిర్మాతలు ప్రభాస్‌కు రు. 100 కోట్లు పే చేసినట్టు టాక్ ? ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ కొత్త రెమ్యునరేషన్ ఏకంగా రు. 120 కోట్లుగా ఉందట. ఇప్పుడు ఈ రెమ్యునరేషన్‌పై ఫిలింనగర్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సౌత్‌లో విజయ్ లాంటి వాళ్లు మాత్రమే రు. 80 – 100 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ బడా హీరోల రెమ్యునరేషన్లు కూడా రు. 100 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ వారందరికి షాక్ ఇస్తూ దేశంలోనే హయ్యస్ట్ రెమ్యునరేష్ తీసుకునే వన్ అండ్ ఓన్లీ స్టార్ కానున్నాడుఅయితే ప్రభాస్ ఈ మార్కెట్, ఈ రెమ్యునరేషన్.. ఈ డిమాండ్ నిలుపుకోవాలంటే తర్వాత వచ్చే తన పాన్ ఇండియా సినిమాలతో కూడా సూపర్ హిట్లు కొట్టాలి. ఇక వరుసగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లైన్లో ఉన్నాయి. ఇక మారుతి – ప్రభాస్ సినిమా నిర్మిస్తోన్న నిర్మాత దానయ్య సైతం ప్రభాస్‌కు రు. 75 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నాడట. అయితే ఈ సినిమాకు ప్రభాస్ కేవలం 50 రోజుల కాల్షీట్లే ఇచ్చాడని టాక్ ?