టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్…. అలనాటి తార ఊహ ఎవ్వరికి తెలియకుండా సింపుల్‌గా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో శ్రీకాంత్ – ఊహా కాంబినేషన్లో వరుసగా సినిమాలు వచ్చేవి. అయితే వీరి కాంబినేషన్ పదే పదే రిపీట్ అవుతున్నా కూడా ఎవ్వరికి వీరి మధ్య ప్రేమ ఉందన్న అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అప్పట్లో ఊహను అందరు పిల్లికళ్ల సుందరి అనేవారు. ఆమె కళ్లు చిన్నగా ఉండి అందరిని ఆకట్టుకునేవి.
ఇక ఊహతో వరుసగా సినిమాలు చేస్తోన్న క్రమంలోనే శ్రీకాంత్ తన కుటుంబంలో జరిగే అన్ని ఫంక్షన్లకు ఆమెను పిలిచేవాడట. అలా తన ఇంట్లో వాళ్లకు ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారట. దీంతో శ్రీకాంత్ ఇంట్లో వాళ్లకు కూడా ఆమెను ప్రేమిస్తున్నాడన్న అనుమానం రాలేదు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు తాను ఊహను ప్రేమిస్తున్నా అని చెప్పేశాడట.
తన ఇంట్లో వాళ్లను ముందుగా ఒప్పించి తర్వాత ఓ బంగారు గొలుసు తీనుకుని నేరుగా ఊహా వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడట. అక్కడ ఆమె తల్లిదండ్రుల ముందే ఊహకు ప్రపోజ్ చేసేశాడట. అయితే ముందుగా ఊహ ఇంట్లో వాళ్లు కాస్త తటపటాయించినా చివరకు శ్రీకాంత్‌ను తమ ఇంటి అల్లుడిని చేసుకునేందుకు ఒప్పుకున్నారు. ఒకవేళ ఊహ ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చిరంజీవిని రంగంలోకి దించాలని శ్రీకాంత్ ముందే ప్లాన్ చేసుకుని… చిరంజీవికి కూడా ఈ విషయం చెప్పేశారట.
అయితే చిరు అవసరం రాకుండానే ఊహా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. ఇక ఊహా పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. శ్రీకాంత్ దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా నిర్మలా కాన్వెంట్ ప్లాప్ అయినా.. రెండో సినిమా పెళ్లిసందడితో హిట్ కొట్టాడు. ఇప్పుడు రోషన్‌తో సినిమాలు చేసేందుకు పెద్ద బ్యానర్లు, దర్శకులే క్యూలో ఉన్నారు.
ఇక ఊహా తన సెకండ్ ఇన్సింగ్స్‌లో తన భర్త శ్రీకాంత్‌తో కలిసి మాత్రమే నటిస్తానని.. అది కూడా రోషన్‌కు తల్లిగా నటించాలన్నదే తన కోరిక అని చెప్పుకువచ్చింది. ఇక శ్రీకాంత్ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడంతో పాటు అఖండ సినిమాతో విలన్ అవతారం కూడా ఎత్తాడు. ఇక ఊహకు తన భర్త శ్రీకాంత్ నటించిన సినిమాలలో ఖడ్గం, తారక రాముడు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.