హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం అయిపోయింది. దేశంలోనే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల తర్వాత హైదరాబాద్ దూసుకుపోతోంది. ఆ మహా నగరాలకే సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ భారీ ఎత్తున మాల్స్ పుట్టుకు వస్తున్నాయి. పీవీఆర్, సుజనా, ఇనార్బిట్, మోర్, సినీ ప్లానెట్, బిగ్‌బజార్, ప్రసాద్ మల్టీఫ్లెక్స్, ఈ కోవలోనే గచ్చిబౌలీలో మహేష్‌బాబు ఏఎంబీ మాల్ కూడా పుట్టుకు వచ్చింది. ప్రసాద్ మల్టీఫ్లెక్స్ తర్వాత ఆ రేంజ్‌లో అత్యాధునిక హంగులతో ఈ మాల్ ఏర్పాటు అయ్యింది.
ఐటీ కారిడార్‌తో పాటు గచ్చిబౌలి మొత్తాన్ని ఈ మాల్ కవర్ చేస్తోంది. ఆసియన్ సునీల్‌తో కలిసి మహేష్‌బాబు ఈ మాల్ నిర్మించాడు. లోపల ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉంటుంది. ఈ మాల్లో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన మొత్తం 7 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో 1 వీఐపీ స్క్రీన్ కాగా.. మరో 6 మామూలు స్క్రీన్లు. హైదరాబాద్ మాల్స్, మల్టీఫ్లెక్సులు అన్నింటిలోనూ ఇప్పుడు ఇదే తోపు అయిపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏఎంబీ మాల్ సరికొత్త బిజినెస్ స్ట్రాటజీతో నగరంలో మిగిలిన మల్టీఫ్లెక్స్‌లకు దడపుట్టిస్తోంది. సినిమాల ట్రైలర్లు, టీజర్ల లాంచ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అన్ని ఏఎంబీ మాల్లోనే ఎక్కువుగా జరుగుతున్నాయి. మీడియా ప్రచారానికి అవసరమైన వెసులుబాట్లు కల్పించడంతో పాటు అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు అందరూ కూడా ఏఎంబీ వైపే చూస్తున్నారు.
అన్నింటికి మించి ఇతర మల్టీఫ్లెక్సల్తో పోలిస్తే ఇక్కడ ఇక్కడ ఒక్కో ప్రోగ్రామ్‌కు చాలా తక్కువ వసూలు చేస్తున్నారు. ఏఎంబీలో కేవలం 1.10 లక్షలు మాత్రమే వసూలు చేస్తున్నారట. అదే ఇతర మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్‌లో అయితే అక్షరాలా రు. 2 నుంచి రు 2.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. అంటే చాలా ఎక్కువ. ఏఎంబీ మాల్ ఇండస్ట్రీ వాళ్లను ఆకర్షించడానికి మార్కెట్ స్ట్రాటజీతోనే ఈ ప్లాన్ చేస్తోంది.
ఏఎంబీని సాధ్యమైనంత వరకు సామాన్యులకు అందుబాటులోకి తేవడంతో పాటు మార్కెట్లోకి తీసుకువెళ్లే ప్లాన్‌లోనే నిర్వాహకులు ఇలా భారీగా రేట్లు తగ్గించేశారని టాక్ ? ఏఎంబీ లాంచింగ్ టైంలో రేట్లు చాలా ఎక్కువ అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ లేకుండా చేసేందుకు.. ఇతర మల్టీఫ్లెక్స్‌లకు షాక్ ఇచ్చేందుకే ఇలా చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.