Moviesఅలాంటి సీన్స్ నాకు ఇష్టం..రొమాన్స్ సీన్స్ పై రాశీ ఖన్నా బోల్డ్...

అలాంటి సీన్స్ నాకు ఇష్టం..రొమాన్స్ సీన్స్ పై రాశీ ఖన్నా బోల్డ్ కామెంట్స్..!!

రాశీ ఖన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో..అందం తో కుర్రకారుని కి నిద్ర పట్టనీకుండా చేస్తున్న బ్యూటీ ఈ రాశీ ఖన్నా. జనరల్ గా సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి పోవాలని వెండితెరపై హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది అమ్మాయిలు కలలుకంటూ ఉంటారు. కానీ వాళ్లలో కొందరే హీరోయిన్ కావడానికి కష్టపడి..స్టార్ హీరోయిన్ గా మారుతారు. అలాంటి వారిలో ఒకరు ఈ ఢిల్లీ అమ్మాయి రాశీఖ‌న్నా. మంచి చదువు చదువుకుని ఐఏఎస్ అవ్వాలని కలలు కనేదట. అలాంటి రాశిఖన్నా అనుకోకుండా మోడలింగ్ లోకి వచ్చి ఇప్పుడు సడన్‌గా హీరోయిన్ గా మారింది.

 

మద్రాస్ కెఫే తో వెండితెరకు పరిచయం అయిన రాశీఖన్నా.. ఆ తరువాత అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే ‘సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి ..తన నటన తో అందరిని మెప్పించింది. ఆ తరువాత సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇక వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈమె..నటన అందం చూసిన ఇతర దర్శకులు నిర్మాతలు ఆయా చిత్రాల్లో అవకాశాలు పుష్కలంగా ఇచ్చారు.దాంతో వరుస ఆఫర్లు రావడంతో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ‘రాశీ ఖన్నా‘ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది.

ప్రజెంట్ హీరో గోపీ చంద పక్కన “పక్క కమర్షీయల్” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ రొమాన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని రిపోర్టర్ అడగ్గా.. ఆమె సమాధానం ఇస్తూ… “నాకు రొమాంటిక్ సీన్స్ అంటేనే చాలా ఇష్టం అని చెప్పి షాక్ ఇచ్చింది. కామెడీ సీన్స్ చేయడం కష్టం అని..దాని కన్నా కూడా రొమాంటిక్ సీన్లలో నటించడమే ఈజీ.. అని చెప్పుకొచ్చింది. అంతేకాదు..ఇప్పటివరకు రొమాంటిక్ సీన్లలో యాక్ట్ చేసిన..రాశీ.. ఇక పై కామెడీ జోనర్‌ను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news