Moviesక‌ళ్లు చెదిరే రేంజ్‌లో రామ్ ' వారియ‌ర్ ' ప్రి రిలీజ్...

క‌ళ్లు చెదిరే రేంజ్‌లో రామ్ ‘ వారియ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బిగ్ టార్గెట్లే…!

మాస్ హీరో రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో త‌న ప్లాపుల‌కు చెక్ పెట్టేశాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రామ్ ఇప్పుడు వారియ‌ర్ సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్‌లో డిఫ‌రెంట్ సినిమాలు తీస్తాడ‌ని మంచి పేరున్న మాస్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో అన్ని ఏరియాల్లోనూ భారీ రేట్ల‌కే అమ్ముతున్నారు. రామ్ కెరీర్‌లోనే టాప్ లేపే రేంజ్‌లో వారియ‌ర్ ప్రి రిలీజ్ జిజినెస్ జ‌రుగుతోంది.

ఆంధ్రా ఏరియాకు రు. 18 కోట్లు కోట్ చేస్తున్నారు. ఈ రేషియోలోనే ఉత్త‌రాంధ్ర ఏరియాతో పాటు వెస్ట్ గోదావ‌రి బిజినెస్ క్లోజ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో వైజాగ్ మార్కెట్ చాలా బాగుంది. మిగిలిన ఏరియాల సంగ‌తి ఎలా ఉన్నా ఓ మోస్త‌రు, మిడ్ రేంజ్ సినిమాలు సైతం వైజాగ్ ఏరియాలో మంచి వ‌సూళ్లు కొల్ల‌గొడుతున్నాయి. విక్ర‌మ్ అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి భారీ లాభాలు సొంతం చేసుకుంది.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర ఏరియాకు వైజాగ్ సిటీ గుండెకాయ‌లా ఉంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఇక్క‌డ ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సిటీ వ‌సూళ్లే ఇక్క‌డ అన్నిసినిమాల‌ను సింపుల్‌గా బ్రేక్ ఈవెన్ చేసేస్తున్నాయి. అంతెందుకు అంటే సుంద‌రానికి సినిమా మిగిలిన ఏరియాల్లో న‌ష్ట‌పోతుంటే విశాఖ‌లో మాత్రం బ్రెక్ ఈవెన్‌కు వ‌చ్చేసింది. స‌ర్కారు వారి పాట కూడా సేమ్ బ్రేక్ ఈవెన్ చేసింది.

అందుకే విశాఖ ఏరియాకు ఇప్పుడు అన్ని సినిమాల రైట్స్ విష‌యంలో పోటీ ఎక్కువుగా ఉంటోంది. అందుకే వారియ‌ర్ ఉత్త‌రాంధ్ర రైట్స్ రామ్ స్వ‌యంగా తీసుకున్నాడు. ఇందుకోసం రు 4.32 కోట్లు ఇస్తున్నాడ‌ట‌. పంపిణీ అంతా అన్న‌పూర్ణ సాయిబాబా ద్వారా జ‌రుగుతుంద‌ట‌. ఇక వెస్ట్ హ‌క్కులు మ‌హాల‌క్ష్మి ఫీలింస్ అధినేత ఎల్వీఆర్ తీసుకున్నారు. ఆయ‌న‌ది అక్క‌డ టాప్ హ్యాండ్‌.

ఈ లెక్క‌న ఓ థియేట‌ర్ హ‌క్కుల మీదే రు. 40 కోట్లు వ‌ర‌కు వ‌స్తుంద‌ని అంటున్నారు. లింగుస్వామి మాస్ టేకింగ్ అంటే జ‌నాల‌కు పిచ్చ న‌మ్మ‌కం ఉంది. ఇక కృతిశెట్టి హీరోయిన్ కావ‌డంతో యూత్‌లో ఆమెకు క్రేజ్ ఉంది. ఇవ‌న్నీ క‌లిసే ఈ సినిమాకు క‌ళ్లు చెదిరే రేంజ్‌లో బిజినెస్ జ‌రిగేలా చేస్తున్నాయి. మ‌రి రామ్ ఈ భారీ టార్గెట్ ఎలా ? చేధిస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news