Moviesఅడ‌వి శేష్ ' మేజ‌ర్ ' సినిమా గురించి 10 ఇంట్ర‌స్టింగ్...

అడ‌వి శేష్ ‘ మేజ‌ర్ ‘ సినిమా గురించి 10 ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే…!

అడ‌వి శేష్ హీరోగా శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా మేజ‌ర్‌. ఈ బ‌యోగ్రాఫిక‌ల్ యాక్ష‌న్ డ్రామాలో ప్ర‌కాష్‌రాజ్‌, రేవ‌తి, స‌యి మంజ్రేక‌ర్‌, శోభిత ధూళిపాళ్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా యునాన‌మ‌స్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. ఈ మేజ‌ర్ సినిమా గురించి 10 ఆసక్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

1- 26 / 11 ఉగ్ర‌దాడుల్లో తాజ్ హోట‌ల్లో చిక్కుకున్న సామాన్య ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతూ అమ‌రుడు అయిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత చ‌రిత్ర ఆధారంగా మేజ‌ర్ తెర‌కెక్కింది. చాలా మందికి మేజర్ ఎలా ? చనిపోయాడో తెలుసు కాని.. ఆయ‌న ఎలా ? జీవించాడు అన్న విష‌యం తెలియ‌దు. ఆయ‌న జీవితంలో సంఘ‌ట‌న‌ల‌ను మ‌న‌స్సును తాకేలా ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

2- ఈ సినిమా టైటిల్ రోల్ అయిన మేజ‌ర్ ఉన్ని కృష్ణ‌న్‌గా అడ‌వి శేష్ న‌టించ‌గా.. శశి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో గూఢ‌చారి సినిమా వ‌చ్చి హిట్ అయ్యింది.

3- ఈ సినిమాకు మేజ‌ర్‌, మేజ‌ర్ సందీప్ అనే రెండు టైటిల్స్ ముందుగా అనుకున్నారు. అయితే చివ‌ర‌కు ముందు అనుకున్న మేజ‌ర్ టైటిల్ ఫిక్స్ చేశారు. సోనీ పిక్చ‌ర్స్ సంస్థ ముందుగా మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి ఈ సినిమా తీసేందుకు అనుమ‌తులు తీసుకుంది.

4- నిర్మాత‌లు అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్‌చంద్ర‌లు ఈ సినిమా గురించి ఓ సారి మ‌హేష్‌బాబుకు చెప్ప‌గా తాను కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటాన‌ని చెప్పారు. ఇలాంటి సినిమాలో తాను భాగ‌స్వామిని అవ్వ‌డం త‌న‌కు నిజంగా గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని మ‌హేష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు.

5- తెలుగుతో పాటు నార్త్ ప్రేక్ష‌కుల‌కు కూడా క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమా తెర‌కెక్కించారు. హిందీలో కూడా ఒకే సారి షూట్ చేశారు. మొత్తం 120 రోజుల పాటు 75 లొకేష‌న్ల‌లో 8 భారీ సెట్లు వేసి ఈ సినిమా షూటింగ్ చేశారు.

6- ఈ సినిమా రిలీజ్ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ వినూత్న ప్ర‌చారం చేసింది. ముందుగా ఎంపిక చేసిన న‌గ‌రాల్లో స్పెష‌ల్ ప్రీమియ‌ర్లు వారం రోజుల ముందే వేశారు. రిలీజ్‌కు ముందే ప్రేక్ష‌కుల కోసం ఓ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌డం ఇదే తొలిసారి.

7- 2008లో ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ప్పుడు అడ‌వి శేష్ మేజ‌ర్ సందీప్‌ను చూసిన వెంట‌నే త‌న‌కు అన్న‌య్య‌లా ఉన్నాడ‌ని ఫీల్ అయ్యార‌ట‌. అప్ప‌టి నుంచే సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి వివ‌రాలు సేక‌రించ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

8- మేజ‌ర్ సందీప్ గురించి తెలుసుకునేందుకు అడ‌వి శేష్ ఆయ‌న త‌ల్లిదండ్రుల‌ను స్వ‌యంగా క‌లిశారు. కొద్ది రోజులు వారితో క‌లిసి జ‌ర్నీ చేశాడు. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని విష‌యాలు తెలిశాయి. అయితే ఆ త‌ర్వాత సందీప్ తండ్రి అడ‌వి శేష్‌తో నువ్వు మా అబ్బాయి గురించి సినిమా తీయ‌గ‌ల‌వ‌ని 10 శాతం న‌మ్మ‌కం క‌లిగింద‌ని చెప్ప‌డంతో అంద‌రూ న‌వ్వేశార‌ట‌.

9- సందీప్ త‌ల్లిదండ్రుల‌ను క‌లిసేందుకు శేష్ నాలుగైదు సార్లు బెంగ‌ళూరు వెళ్లార‌ట‌. ఓ సారి వారి అపార్ట్‌మెంట్లో వాళ్ల‌ను క‌లిసేందుకు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండ‌గా… సందీప్ త‌ల్లి అడ‌వి శేష్‌ను పిలిచి అచ్చం నా సందీప్‌లా ఉన్నావ‌ని చెప్పింద‌ట‌.

10- మ‌నం చేయాల‌నుకున్న ప‌నిమీద న‌మ్మ‌కం.. ప‌నిచేసేట‌ప్పుడు నిబ‌ద్ద‌త ఇవి రెండూ మేజ‌ర్ సందీప్ ల‌క్ష‌ణాలు అనుకుని తాను మేజ‌ర్ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాన‌ని అడ‌వి శేష్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news