Moviesప్ర‌భాస్ కోసం అనుష్క ఏం చేస్తుందో .. తెలుసా...!

ప్ర‌భాస్ కోసం అనుష్క ఏం చేస్తుందో .. తెలుసా…!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, స్వీటీబ్యూటీ అనుష్క కాంబినేష‌న్‌కు వెండితెర‌పై ఎంత క్రేజ్ ఉంటుందో చూశాం. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాల‌న్నీ దాదాపు స‌క్సెసే. బిల్లా – మిర్చి – బాహుబ‌లి 1 – బాహుబ‌లి 2 ఇలా అన్ని సినిమాలు సూప‌ర్ హిట్టే. బాహుబ‌లి త‌ర్వాత వీరి కాంబినేష‌న్లో సినిమా కోసం ప్ర‌భాస్ , స్వీటీ అభిమానులు వెయిట్ చేస్తున్నా అది సాధ్యం అవుతుంద‌న్న ఆశ‌లు ఎవ్వ‌రికి లేవు. మ‌రోవైపు అనుష్క ఏజ్ ఇప్ప‌టికే బార్ అయిపోయింది. ఈ టైంలో అనుష్క లావెక్కిపోవ‌డంతో ఆమె మ‌ళ్లీ సినిమాల్లో చేస్తుందా ? అన్న సందేహాలు కూడా అంద‌రిలోనూ ఉన్నాయి.

అయితే ఆమె ప్ర‌భాస్‌తో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలోనే న‌వీన్ పోలిశెట్టి ప‌క్క‌న హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్‌తోనే మ‌ళ్లీ జోడీ క‌ట్ట‌బోతోంది. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భాస్ – మారుతి ప్రాజెక్టు ఊరిస్తూ వార్త‌ల్లో ఉంటోంది. ప్ర‌భాస్ ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. రాధేశ్యామ్ అంచనాలు అందుకోలేదు. అయినా కూడా ప్ర‌భాస్ చేతిలో ఆదిపురుష్ – స‌లార్ – ప్రాజెక్ట్ కే లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుల మ‌ధ్య‌లోనే అనూహ్యంగా మారుతి సినిమా ఓకే అయ్యింది. డీవీవీ దాన‌య్య ఇచ్చిన అడ్వాన్స్ మేర‌కే ప్ర‌భాస్ 50 రోజులు కాల్షీట్లు ఇవ్వ‌డంతో మారుతి సినిమా ఫిక్స్ అయ్యింది. అన్ని కుదిరితే ఈ సినిమా ఈ యేడాదిలోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఈ ముగ్గురు హీరోయిన్ల‌లో అనుష్క ఓ హీరోయిన్ అని గ‌త రెండు నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతూనే వ‌స్తోంది.

ఈ మాస్ మ‌సాలా ఎంట‌ర్టైన‌ర్‌లో అనుష్క క్యారెక్ట‌ర్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌ట‌. ప్ర‌భాస్ – అనుష్క మ‌ధ్య వ‌చ్చే సీన్లు మాస్‌ను మ‌త్తెక్కించేస్తాయంటున్నారు. మారుతి కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అదిరిపోయే ఎలిమెంట్స్ కూడా సిద్ధం చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం గోపీచంద్‌తో మారుతి తీసిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా జూలై 1న వ‌స్తోంది. ఆ వెంట‌నే మారుతి ప్ర‌భాస్ సినిమా క‌థ‌పై వ‌ర్క్ చేస్తాడు.

ఇక ఈ సినిమాలో త‌న పాత్ర కోసం అనుష్క పూర్తిగా స్లిమ్ అయిపోతోంద‌ట‌. బాహుబ‌లి టైంలో సైజ్ జీరో సినిమా చేసిన‌ప్పుడే అనుష్క లావెక్కిపోయింది. ఆ త‌ర్వాత ఆమె స‌న్న‌బ‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాలో నటించేందుకు సన్న‌గా క‌న‌ప‌డేందుకు బాగా వ‌ర్క‌వుట్లు చేస్తోంద‌ట‌. ఏదేమైనా చాలా రోజుల‌కు మ‌ళ్లీ ప్ర‌భాస్ – అనుష్క‌ను వెండితెర మీద చూడ‌బోతున్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news