Moviesరామ్‌చ‌ర‌ణ్ వేసుకున్న ఈ జాకెట్ ఇంత రేటా... దీని స్పెషాలిటీ ఏంటో...!

రామ్‌చ‌ర‌ణ్ వేసుకున్న ఈ జాకెట్ ఇంత రేటా… దీని స్పెషాలిటీ ఏంటో…!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ యేడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ముందుగా మూడున్న‌రేళ్ల నుంచి ఊరిస్తూ వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఈ యేడాది ఎట్ట‌కేల‌కు మార్చి 25న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రామ్‌చ‌ర‌ణ్‌కు తిరుగులేని క్రేజ్‌ను తీసుకువ‌చ్చింది. త్రిబుల్ ఆర్ వ‌చ్చిన నెల రోజుల‌కే త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి చేసిన ఆచార్య సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేక‌పోయింది.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్లో ఏస్ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రోసారి సుకుమార్ కూడా చ‌ర‌ణ్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక తాజాగా చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ ఔట్ పిట్‌తో క‌నిపించాడు. ఈ స్టిల్లో చ‌ర‌న్ వేసుకున్న లెద‌ర్ జాకెట్ అంద‌రిని ఎంతో ఎట్రాక్ట్ చేసింది.

ఈ లెద‌ర్ జాకెట్ రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌స్టింగ్ లుక్‌లో క‌న‌ప‌డ‌డంతో ఫ్యాష‌న్ ప్రియులు వెంట‌నే ఈ జాకెట్ ఎక్క‌డ ? దొరుకుతుంది ? అని రీసెర్చ్ చేసేశారు. దీని రేటు ఎంత అని కూడా ఆరా తీసి త‌ర్వాత షాక్‌కు గుర‌య్యారు. చ‌ర‌ణ్ వేసుకున్న ఈ లెద‌ర్ జాకెట్ ఖ‌రీదు 2600 డాల‌ర్లు. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో దీని రేటు అక్ష‌రాలా రెండు ల‌క్ష‌లు.

అంతే కాదు ఈ ఫొటోలో చ‌ర‌ణ్ వేసుకున్న షు ఖ‌రీదు కూడా రు. 40 వేలు అట‌. సాధార‌ణంగా సినిమా సెల‌బ్రిటీలు అంద‌రూ ఖ‌రీదైన దుస్తులు, షూలు వేసుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే చ‌ర‌న్ కూడా త‌న టేస్ట్‌కు త‌గ్గ‌ట్టుగా ఖ‌రీదైన లెద‌ర్ జాకెట్‌తో పాటు ఖ‌రీదైన షూ వేసుకుని త‌న టేస్ట్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పాడు.

ఇక ఎన్టీఆర్‌కు తాను వేసుకునే దుస్తుల కంటే వాడే యాక్స‌సీరిస్‌లో త‌న టేస్ట్ క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ ధ‌రించే వాచ్‌, షూ చాలా ఖ‌రీదైన‌వి. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే స‌మంత ద‌గ్గ‌ర ఖ‌రీదైన యాక్స‌సిరీస్ క‌లెక్ష‌న్ ఉంది. ఆమె వాడే చెప్పులు, హ్యాండ్ బ్యాగుల రేట్లు లక్షల్లో ఉంటాయ‌నే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news