రెండున్నర దశాబ్దాల క్రిందట పరిచయం అవసరం లేని పేరు కన్నడ ప్రభాకర్. కన్నడ రంగానికి చెందినా కూడా తెలుగు సినిమా రంగంలో కూడా పదేళ్లకు పైగా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు వేసి ప్రత్యేకత చాటుకున్నాడు. కన్నడ ప్రభాకర్ విలనిజానికి తెలుగులో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. జ్వాల – రాక్షసుడు – పసివాడి ప్రాణం – కొదమసింహం – జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి హిట్ సినిమాల్లో ప్రభాకర్ నటించాడు.
ప్రభాకర్ మాతృభాష కన్నడంలో నిజంగానే పులితో ఫైట్ చేయడంతో టైగర్ ప్రభాకర్ పేరుతో మంచి గుర్తింపు పొందాడు. ప్రభాకర్ తన నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ప్రభాకర్ ముందుగా అల్ఫోంజను పెళ్లి చేసుకున్నాడు. వీరి గీత, భారతి కూతర్లతో పాటు వినోద్ అనే కొడుకు ఉన్నాడు. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు ఇచ్చేసి కన్నడ నటి జయమాలను రెండో వివాహం చేసుకున్నాడు.
ఈ దంపతులకు సౌందర్య అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత వీరికి కూడా పొసగక పోవడంతో వీరు కూడా విడిపోయారు. ఆ తర్వాత ప్రభాకర్ మంజు అనే నటిని మూడో వివాహం చేసుకున్నాడు. మళ్లీ ఈ దంపతులకు అర్జున్ పుట్టాడు. ఇక కన్నడ ప్రభాకర్ రెండో నటి జయమాల దక్షిణ కన్నడ జిల్లాలో పుట్టారు. జయమాల తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో రాజ్‌కుమార్, విష్ణువర్థన్, అంబరీష్, అనంత నాగ్, కన్నడ ప్రభాకర్, చిరంజీవి లాంటి హీరోలతో నటించారు.
టైగర్ ప్రభాకర్‌తో విడాకుల తర్వాత ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కన్నడ ఫిల్మ్‌ఛాంబర్‌కు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అవ్వడంతో పాటు కర్నాటక స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు.
జయమాలిని తెలుగులో 1979లో అర్జున భంగం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భామరుక్మిణి సినిమా చేసింది. 1980వ దశకంలో మెగాస్టార్ చిరంజీవితో రాక్షసుడు సినిమా చేసింది. ఈ సినిమాలో ఇళయరాజా స్వరపర్చిన నీమీద నాకు అమ్మమ్మో అందంమే దాచలేను ఓ యబ్బో అనే సాంగ్ లో జయమాల కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు క్రమంగా దూరమైపోయింది.