గోపీచంద్..ఒకప్పుడు ఈ పేరు కి జనాల్లో పిచ్చ క్రేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలు చేయడంలో గోపీచంద్ కి పెట్టింది పేరు. లుక్స్ హీరోగా ఉన్నా..కెరీర్ పరంగా విలన్ గానే బాగా గుర్తుండిపోయే పాత్రలు చేశారు గోపీచంద్. హ్యాండ్ సమ్ లుక్స్ తో ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాతోనే అందరి కళ్లు తన వైపు పడేలా చేసుకున్న గోపిచంద్.. “తొలి వలపు” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తన నటన స్టైల్ ను జనాలకి పరిచయం చేశాడు. “తోలివలపు” సినిమాలో చాలా అమాయకంగా కనిపించిన..ఈ హీరో..ఆ తరువాత తన రూట్ మార్చుకుని సడెన్ గా విలన్ అవతారం ఎత్తాడు.
ఫస్ట్ నితిన్ హీరోగా నటించిన జయం లో విలన్ గా కనిపించి ..హీరో గా కన్నా విలన్ గా బాగున్నాడు అంటూ ఓ సరికొత్త మార్క్ వేయించుకున్నాడు. ఆ తరువాత నిజం, వర్షం వంటి చిత్రాలలో విలన్‌గా ఆయన నటించిన తీరు ఇప్పటికి జనల చేత శభాష్ అనిపిస్తుంది. బడా సినిమాల చిత్రాలలో విలన్‌గా ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకున్న..ఈయన ప్రజెంట్ మారుతి డైరెక్షన్ లో “పక్క కమర్షియల్” సినిమా పేరుతో మనముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ..తన కెరీర్ లోని పాత రోజుల గురించి గుర్తుచేసుకున్నారు.
తన ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ డీటైల్స్ చెప్పుతూ..ఆయనకి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం “జయం” అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జయం సినిమా రెమ్యూనరేష బయట పెడుతూ..డైరెక్టర్ తేజ అప్పుడు ఆయనకు విలన్ రోల్ చేసినందుకు గాను 11 వేల రూపాయలు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. దాని పక్కన ఒక్క సున్న పెడితే బాగుండు అని ఆ రోజుల్లో అనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. దీని పై కొందరు నెటిజన్స్..విలన్ రోల్ కి కేవలం 11వేలు నా..తేజ ఇంకొంచెం ఎక్కువుగానే పారితోషకం ఇచ్చి ఉండచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోపీచంద్ పక్క కమర్షియల్ సినిమాకి గాను 8 కోట్లు పారితోషకం తీసుకున్నాడట.. తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇదే అంటూ చెప్పుకొచ్చారు.