Moviesఓరి శంకరా ..ఒక్క షాట్ కొసం మూడు కొట్లా..?

ఓరి శంకరా ..ఒక్క షాట్ కొసం మూడు కొట్లా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్ లు రాను రాను ఎక్కువ అయిపోతున్నాయి. సినిమాను తెరకెక్కించేందుకు డబ్బులు ఎంత ఖర్చు చేస్తున్నారో..దానికి సరి సమానంగా..ప్రీ రిలీజ్ ఈవెంట్లకి..ఫస్ట్ లుక్స్ కి, ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

ఇంత భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమా హిట్ అయితే పర్లేదు..ఒక్కవేళ ఫ్లాప్ అయితే..నిర్మాతల పని గొవిందా గోవిందా. ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుంది నిర్మాత దిల్ రాజుకి. మనకు తెలిసిందే..టాలీవుడ్ స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ , స్టార్ డైరెక్ట‌ర్‌ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌సీ 15 అనే సినిమా చేస్తున్నారు. దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కనున్నట్లు క్రేజీ న్యూస్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అయితే, తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ గా మారింది. ఆర్‌సీ 15 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట. చరణ్ ఫస్ట్ లుక్ కోసం ఏకంగా 3 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కోసం ఇంత మొత్తం వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఇది 50వ చిత్రంగా రావడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, జయరామ్, శ్రీకాంత్, యస్.జే.సూర్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news