టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని..రీసెంట్ గా నటించిన చిత్రం..‘అంటే… సుందరానికీ’. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా నటించిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఫీల్ గుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసింది ఈయనే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రం కావడంతో ‘అంటే… సుందరానికీ!’పై ఆటోమేటిక్గా అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నో వల్గర్ సీన్స్ అంటూ సినిమా చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమాని అని..మూవీలో నాని యాక్టింగ్ చాలా బాగుందని..నజ్రియా నజీమ్ ఎక్స్ ప్రేషన్స్ ..అల్లరి..చిలిపితనం..జనాలను బాగా అలరించాయని..కేవలం హీరో,హీరోయిన్లే కాదు..సినిమా లో నటించిన ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారని…డైరెక్టర్ కధను బాగా చూయించారని చెప్పుతున్నారు.
దీంతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డిన్నత్లే అని అర్ధమైపోతుంది. అయితే, అన్ని బాగున్నా కానీ..”అంటే సుందరానికి సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లో గా ఉందని..అక్కడ జనాలను బోర్ కొట్టించేశాడు డైరెక్టర్ అంటూ కొందరు జనాలు రివ్యూ ఇవ్వడం..సినిమా కి కొంచెం మైనస్ గా మారింది. మ్యూజిక్, కామెడీ,స్క్రీన్ ప్లే అంతా బాగా సెట్ చేసుకున్న వివేక్..ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం ఆయన మ్యాజిక్ మిక్స్ చేసుంటే..సినిమా ఇంకా భారీ విజయాని అందుకునేదని అంటున్నారు జనాలు. మరి చూడాలి ఫస్ట్ కలెక్షన్స్ ఏ మాత్రం రాబడుతుందో ..ఈ “అంటే సుందరానికి”..