Moviesఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎన్టీఆర్‌పై నిజంగానే మ‌న‌సు ప‌డ్డారా... పిచ్చిగా ప్రేమించారా..!

ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎన్టీఆర్‌పై నిజంగానే మ‌న‌సు ప‌డ్డారా… పిచ్చిగా ప్రేమించారా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ ప‌రంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌కు ప‌ట్టిన గ్ర‌హ‌దోషాలు పోయిన‌ట్టున్నాయి. అందుకే వ‌రుస‌గా ఒక‌టి కాదు రెండు కాదు ఆరు హిట్ల‌తో కెరీర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో పాటు ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ వ‌స్తోన్న పాన్ ఇండియా హిట్ కూడా త్రిబుల్ ఆర్‌తో త‌న ఖాతాలో వేసేసుకున్నాడు.

ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ చాలా మంది హీరోయిన్ల‌తో న‌టించారు. గ‌జాలా, స‌మీరారెడ్డి, ఇలియానా, స‌మంత‌, జెనీలియా, భూమిక లాంటి హీరోయిన్ల‌తో రిపీటెడ్‌గా న‌టించాడు. ఏనాడు ఎన్టీఆర్ – హీరోయిన్ల లింకుల‌పై వార్త‌లు రాలేదు. అయితే ఒకే ఒక్క హీరోయిన్ విష‌యంలో ఎన్టీఆర్ చాలా క్లోజ్‌గా ఉన్నాడ‌న్న రూమ‌ర్ అయితే ఉంది. ఆమె స‌మీరారెడ్డి. ఎన్టీఆర్‌కు జోడీగా స‌మీరా న‌ర‌సింహుడు, అశోక్ రెండు సినిమాల్లో న‌టించింది. అశోక్ సినిమాలో ఎన్టీఆరే స్వ‌యంగా రిక‌మెండ్ చేసి మ‌రీ ఆమెను హీరోయిన్‌గా పెట్టించాడ‌నే అంటారు.

ఎన్టీఆర్‌ ఆమెకు ఖ‌రీదైన గిఫ్ట్‌లు కూడా పంపేవాడ‌ట‌. స‌మీరా తెలుగ‌మ్మాయే. ఈ చ‌నువుతోనే ఆమె ఎన్టీఆర్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ఎన్టీఆర్‌ను ఆమె ఇష్ట‌ప‌డింద‌ని కూడా అంటారు. అప్ప‌ట‌కీ ఎన్టీఆర్ మాత్రం త‌న‌తో నటించిన మిగిలిన హీరోయిన్ల కంటే స‌మీరాతో మ‌రింత క్లోజ్‌గా ఉండ‌డంతో పాటు గిఫ్ట్‌లు పంప‌డంతో కొన్ని రూమ‌ర్లు బాగా స్ప్రెడ్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే ఆమెతో ఎన్టీఆర్ చేసిన న‌ర‌సింహుడు, అశోక్ రెండూ ప్లాప్ అయ్యాయి.

త‌ర్వాత ఏమైందో కాని.. ఇంట్లో పెద్ద‌ల ఒత్తిడితో ఆమెతో స్నేహాన్ని సైతం ఎన్టీఆర్ తెగ‌తెంపులు చేసుకున్నాడ‌నే అంటారు. అయితే స‌మీరా కంటే ముందే ఎన్టీఆర్‌ను గ‌జాలా కూడా ఇష్ట‌ప‌డింద‌న్న రూమ‌ర్ ఉంది. గ‌జాల‌తో ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబ‌ర్ 1 – అల్ల‌రి రాముడు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ కెరీర్ తొలి హిట్ స్టూడెంట్ నెంబ‌ర్ 1 హీరోయిన్ గ‌జాలా. ఆ త‌ర్వాత ఆమెను బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల్ల‌రి రాముడు సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌గా రిపీట్ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అయ్యాయి.

అలా అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రు హీరోయిన్లు ఎన్టీఆర్‌ను బాగా ఇష్ట‌ప‌డ‌డంతో పాటు ఎన్టీఆర్‌పై మ‌న‌సు పారేసుకున్నార‌న్న రూమ‌ర్లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఇద్ద‌రిలోనూ స‌మీరారెడ్డితో క్లోజ్‌గా ఉన్నాడ‌న్న‌దే బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇక పెళ్ల‌య్యాక ఎన్టీఆర్‌పై ఈ రూమ‌ర్లు ఎప్పుడూ స్ప్రెడ్ కాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news