వినడానికే ఈ మాట కాస్త చివుక్కుమనిపించింది. ఎంతోమంది సెలబ్రిటీ జంటలు చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. చైతు – సమంత విడిపోవడానికి నాలుగు నెలల ముందు వరకు కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మనసు ముక్కలవ్వడానికి ఒక్క క్షణం చాలు.. చైతు – సమంత ఇప్పటకీ చాలా మంది ఎలా నమ్మడం లేదో ఇప్పుడు అదే బాటలో మరో సెలబ్రిటీ జంట నడవబోతున్నారన్న వార్త ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచి వేస్తోంది. గాయకులు శ్రావణి భార్గవి – హేమచంద్ర విడిపోతున్నారన్న వార్త బయటకు పొక్కింది.
వీరి మధ్య ఉన్న చిన్న పొరాపొచ్చలు కాస్త పెరిగి పెద్దవి కావడంతో వాళ్లు ప్రస్తుతం విడిగా ఉంటున్నారనే అంటున్నారు. ఇలా సెలబ్రిటీల మనస్పర్థలు, విడాకులకు ముందు విడివిడిగా ఉంటోన్న వార్తలు ఒక్కసారిగా గాసిప్లుగానే గుప్పుమంటున్నాయి. చైతు – సమంత నుంచి మొదలు పెడితే ఎంతోమంది ముందుగా ఈ వార్తలను ఖండించడం.. తర్వాత విడిపోవడం కామన్ అయిపోయింది.
అంతెందుకు చిరు చిన్న కూతురు – కళ్యాణ్ దేవ్ విడిగా ఉంటున్నారని.. విడాకులు తీసుకుంటున్నారని ఎన్ని వార్తలు వచ్చినా వారు ఖండిచలేదు. అలా అని వారు కలిసి ఉండడం లేదు.. ఈ ఒక్కటి చాలు వారు విడిపోయేందుకు మానసికంగా సిద్ధమయ్యారని..! సరే కలిసుండడం, విడిపోవడం అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్లది. అయితే శ్రావణ భార్గవి – హేమచంద్రది చూడముచ్చటైన జంట. పద్ధతిగా ఉంటారు.
ఇద్దరికి తమ కళలో మెరిట్ ఉంది. 9 ఏళ్ల క్రితం ఒక్కటైన ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. ఎక్కడా కూడా ఓవర్ చేయడం… అసభ్యంగా వ్యవహరించడం కాని వాళ్లకు తెలియదు. వాళ్లకు వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు వీరి మధ్య గ్యాప్.. విడాకుల వార్తలతో వాళ్లందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు.
ఇంజనీరింగ్ చదివి.. ఏంబీయే చేసిన శ్రావణ భార్గవి పాటలు పాడడంతో మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి బుల్లితెర మీద కనిపిస్తే ఆ మజాయే వేరు. హేమచంద్ర డబ్బింగ్ ఆర్టిస్టు.. నాలుగైదు సినిమాలకు మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు. ఇటీవల ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షోకు కూడా కలిసే వచ్చారు. ఇంతలోనే ఈ వార్తలేంటో అర్థం కావడంలేదు. ఏదేమైనా ఈ వార్త అబద్ధం అయితే బాగుణ్ణు అని కోరుకుందాం..!