చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ఓ సపరేటు పేజీ లిఖించుకున్న గొప్ప నటుడు. ఎవ్వరి హెల్ప లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..తన కష్టం తో ఇంటటి గొప్ప స్దానాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. ఈయన ను స్పూర్తిగా తీసుకుని..ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి..సక్సెస్ అయ్యారు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలో నటించారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కూడా నటించి..అభిమానులను మెప్పించారు. అలాంటి ఈయన ఓ సినిమా కధ విని..ఈ సినిమా నాకంటే వెంకటేష్ కే బాగుంటుందని చెప్పారట. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
2001లో చిరంజీవి హీరోగా.. సిమ్రాన్ బగ్గ, అశ్విని భాల్ల, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, శరత్ బాబు, ఎమ్ ఎస్ నారాయణ, ఉత్తేజ్, అల్లు అర్జున్ తదితరులు ముఖ్యపాత్రాల్లో నటించీన్ సినిమా డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. నిజానికి సినిమా కధ బాగుంది. కానీ, చిరంజీవికి సెట్ అవ్వలేదు అన్న మాటలు ఎక్కువుగా వినిపించాయి. చిరంజీవి మార్క్ సినిమా అనిపించుకోలేకపోయింది ఈ డాడీ సినిమా. పాటలు, డైలాగ్స్ హృదయాని హత్తుకునే విధంగా ఉన్నా కానీ, చిరంజీవి ఆ రిచ్ అందుకోలేకపోయాడు.
అయితే ఈ కథ ను చిరు కి చెప్పిన్నప్పుడు… వెంటనే ఆయన ఈ సినిమా నా కంటే కూడా వెంకటేశ్ కి అయితే బాగుంటుందని ,,ఫ్యామిలీ సెంటిమెంట్స్ పండించడంలో ఆయన ధిట్ట అని చెప్పుకొచ్చారట. ఇదే విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ, ఈ సినిమా కథ రచయిత భూపతిరాజా.. మీకైతే ఫ్యామిలీమెన్గా కాస్త వెరైటీగా ఉంటుందని నన్ను కన్వీన్స్ చేసి..ఈ డాడీ సినిమాను తెరకెక్కించారు అంటూ చెప్పుతూ..సినిమా రిలీజ్ అయ్యాక కూడా వెంకీ కాల్ చేసి..
” కధ సూపర్బ్ గా ఉంది. నీకన్నా కూడా నేను చేసి ఉంటే అద్దిరిపోయేది ” అని అన్నారట. అప్పుడు చిరంజీవి కూడా “ఇదే విషయాని నేను చెప్పాను. కానీ, డైరెక్టర్స్ వినలేదు వెంకీ”అంటూ చెప్పుకొచ్చారట. డాడి సినిమా లి నిర్మాత గా అల్లు అరవింద్ వ్యవహరించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు. ఈ సినిమాలో “గుమ్మడీ గుమ్మడి” పాట ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే..!