సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి.. ఈ ట్రోలింగ్ సమస్యలు ఎక్కువైపోయాయి.చిన్న పెద్ద, కులం మతం, సామాన్యులు-సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు-రాజకీయ నాయకులు..అంతేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్..అంత రెచ్చిపోతున్నారు. మిస్టేక్స్ అందరు చేస్తారు..తప్పు చేయని మనిషి అంటూ అస్సలు ఉండరు. కానీ, చేసిన తప్పును తెలుసుకుని..ఆ తప్పు మళ్లీ చేయకుండా ఉండటమే మానవ లక్షణం..ఈ రోజులో అలాంటి వాళ్లని మనం రేర్ గా చూస్తుంటాం.
అయితే, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని భీబత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటీజన్స్. దానికి కారణం ఆచార్య. మనకు తెలిసిందే..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టిండి. దారుణమైన టాక్ తెచ్చుకుని..కొరటాల్ కెరీర్ లోనే ఫ్లాప్ చిత్రంగా నమోదు అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత చాలా మంది చిరంజీవి, చరణ్, కొరటాల శివను బాగా ట్రోల్ చేసారు. సినిమా తీయ్యడం రాదా నీకు అని డైరెక్టర్ని..ఇంత చెత్త సినిమాని ఎలా ఒప్పుకున్నావు అని చిరు, చరణ్ ని కూడా కలిపి ఏకిపారేశారు. కానీ, చిరంజీవి-చరణ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ..సైలెంట్ అయిపోయి..తమ నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ చేసారు.
కాగా, ఈ సినిమా OTT లో రిలీజ్ అయ్యింది. దీంతో పని లేని ఓ సో కాల్డ్ బ్యాచ్.,..సినిమాలోని తప్పులను వెతికి..కావాలనే మెగా ఫ్యామిలీని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ఆచార్య సినిమాలో జరిగిన ఓ మిస్టేక్ ని ఎత్తి చూపుతూ…వైరల్ చేస్తున్నారు ఆ భజన బ్యాచ్. ఆచార్య సినిమాలో, చిరు రధం లాగుతారు గుర్తింది కదా..ఆ రధాని ఆయన వెనక నుండి తోసే టైంలో చిరు కాళ్లకు షూ ధరించి ఉన్నారు.
ఇప్పుడు ఇదే విషయాని డప్పు కొడుతూ..నెట్టింట వైరల్ చేస్తుంది పనిలేని..ఓ బ్యాచ్. ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు దేవుడికి సంబంధించిన పనులను చేసేటప్పుడు భక్తులు చెప్పులను అస్సలు ధరించరు అని, మెగాస్టార్ ఆలయాల గురించే సినిమా చేసి అలా ఎలా మిస్టేక్ చేసారని నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. సినిమాని సినిమాలా చూడండి రా భజన బ్యాచ్..అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు.