పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్‌కు మైక్ దొరికితే పూనకంతో ఎలా ఊగిపోతారో తెలిసిందే. స్టేజ్ మీద గణేష్ చేతిలో మైక్ ఉండి.. ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉంటే ఇక భజన మామూలుగా ఉండదు. అయితే మొన్నామధ్య భీమ్లానాయక్ సినిమా ఫంక్షన్‌కు తనను రాకుండా త్రివిక్రమ్ కుట్ర చేశాడంటూ లీక్ అయిన ఆడియో బండ్లద కాదో కాని పెద్ద కలకలమే రేపింది. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత బండ్లను ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌కు పిలిచారు.
చాలా కాలంగా దూరంగా ఉన్న స్టేజ్ దొరికింది.. చేతిలో మైక్ ఉంది. దీంతో బండ్ల చెలరేగిపోయాడు. తాను ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా మాట్లాడేశాడు. ఇదే ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేసింది. పూరి తన కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాకపోవడాన్ని బండ్ల తప్పు పట్టడంతో పాటు పూరి భార్య లావణ్యను కుంతీదేవి, సీతాదేవితో పోలుస్తూ పరోక్షంగా చార్మి.. పూరి లైఫ్‌లో వ్యాంప్‌లా చొరబడిందన్న సందేహాలు వచ్చేలా మాట్లాడారు.
అయితే ఇప్పుడు పూరితో పాటు చార్మీ నుంచి బండ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే వెళ్లిపోయిందని ఇండస్ట్రీ వాళ్లే అంటున్నారు. ఇటు పూరి టీం నుంచి కూడా.. ఇంకా చెప్పాలంటే చార్మీ ద్వారానే బండ్లకు వెళ్లాల్సిన వార్నింగ్‌లు వెళ్లాయని టాక్ ? వాస్తవంగా చూస్తే పూరి ఈ ఫంక్షన్‌కు రాకపోయినా తన కొడుకుతో సినిమాలు చేశాడు.. ఆకాశ్‌ను హీరోగా నిలబెట్టేందుకు చేయాల్సింది అంతా చేస్తూనే ఉన్నాడు.
ఆకాశ్ గతంలో స్టేజ్ మీద తన తండ్రి పూరి గురించి ఏ రేంజ్‌లో మాట్లాడాడో చూశాం. అంతెందుకు చోర్‌బజార్ సినిమాను బాలయ్య లాంటి సీనియర్ హీరోయే తన వంతుగా ప్రమోట్ చేశాడు. చోర్ బజార్ గురించి ప్రభాస్‌తో కూడా మాట్లాడించింది పూరీ కాదా ? బాలయ్య వచ్చింది ? పూరిని చూశా లేదా బండ్లను చూశా ? అన్న విమర్శలు కూడా బండ్లపై వస్తున్నాయి.
ఇక చార్మీ కూడా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఈ సినిమాకు తెరవెనక కావాల్సినంత ప్రమోషన్ చేయడంలో తన వంతుగా సాయం చేసింది. ఇక తన కొడుకు సినిమా కోసం స్క్రిఫ్ట్‌లు సమకూర్చడమో లేదా కథలు వినడమో లేదా మాటలు ఫ్రీగా రాయడయో పూరి చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ తెలియని బండ్ల ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోతుందా ? అని కూడా పూరి, చార్మీ ఇద్దరూ అసహనంతో ఉందని తెలుస్తోంది.