Moviesఆ కామెంట్స్ బాల‌య్య‌కు దుమ్ము, ధూళితో స‌మానం.. ఆ చెత్త రికార్డుల‌కు...

ఆ కామెంట్స్ బాల‌య్య‌కు దుమ్ము, ధూళితో స‌మానం.. ఆ చెత్త రికార్డుల‌కు ‘ అఖండ‌ ‘ తో చెక్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వరుసగా 5 సినిమాలు ఫ్లాపయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ చిత్రంగా రైతు అనే టైటిల్‌తో సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చ కీలక పాత్ర చేయాల్సి ఉంది. కానీ, ఆయన ఎందుకో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ మూలన పడింది. ఎట్టకేలకు బాలయ్య 100వ చిత్రం క్రిష్ తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందించారు.

ఈ సినిమా తర్వాత బాలయ్య పక్కా కమర్షియల్ సినిమా చేశారు. అదే పైసా వసూల్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కనీసం సగం కథ కూడా వినకుండా కేవలం పూరి మీద నమ్మకంతో ఈ సినిమా చేయడానికి సై అన్నారు. 100 చిత్రాలలో బాలయ్యను చూడని విధంగా పూరి ఎంతో స్టైలిష్‌గా చూపించారు. అంతేకాదు, ఈ 100 చిత్రాలలో బాలయ్య చూపించని మేనరిజం, డైలాగ్ డెలివరీ, మేకోవర్..ఇలా ప్రతీది నందమూరి అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకేలా పూరి చూపించాడు.

ఒకరకంగా ఇది పోకిరి సీక్వెల్ అని చెప్పుకున్న అభిమానులు ఉన్నారు. నన్ను నమ్ముకో ఉన్నదంతా పెట్టుకో..పైసా వసూల్..బీహార్ నీళ్ళు తాగినోళ్ళనే తీహర్ జైల్లో పోయించా..నన్ను కాల్చే రైట్స్ ఇద్దరికే..ఒకరు ఫ్యామిలీ మెంబర్స్, ఇంకొకరు ఫ్యాన్స్..వంటి పూరి మార్క్ డైలాగులు బాలయ్య ఒరిజినల్ నైజానికి దగ్గరగా ఉంటాయి. కమర్షియల్‌గా చెప్పుకునే సక్సెస్ సాధించకపోయినా కూడా బాలయ్యను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి మేకర్స్ సక్సెస్ అయ్యారు.

ఆ తర్వాత తండ్రి నందమూరి తారకరామారావు సినీ, రాజకీయ జీవిత కథ ఆధారంగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు, ఎన్.టి.ఆర్ కథానాయకుడు చిత్రాలను చేశారు బాలయ్య. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బయోపిక్ చిత్రాలు అభిమానులవరకే ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన జై సింహ, రూలర్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. జై సింహా క‌మ‌ర్షియ‌ల్‌గా కొంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అయినా బాల‌య్య రేంజ్‌కు త‌గిన హిట్ కాదు. దాంతో యాంటీ ఫ్యాన్స్ కొందరు బాలయ్యను కామెంట్స్ చేశారు. అయితే, ఇలాంటివన్నీ బాలయ్యకు దుమ్ము ధూళితో సమానం. కనీసం కన్నెత్తి కూడా చూసేరకం కాదు.

అందుకే, అఖండ సినిమాతో వచ్చి 5 ఫ్లాపుల బ్యాడ్ ట్రాక్ రికార్డును చెరిపేశారు. అటు దర్శకుడు బోయాటి శ్రీను వినయ విధేయ రామ ఫ్లాప్‌తో కసితో ఉన్నారు. బాలయ్య వరుస ఫ్లాప్స్ కారణంగా అఖండతో అందరికీ సమాధాం చెప్పాలనుకున్నారు. అందుకే, భారీ హిట్ సాధించి అదే యాంటీ ఫ్యాన్స్ నోట మాట రానివ్వకుండా చేశారు. టికెట్ రేట్ల సమస్య..కరోనా థర్డ్ వేవ్ దాడి..అయినా బాలయ్య దంచి కొట్టారు. నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టారు. బాలయ్య, బోయపాటి అఖండతో హిస్టరీ రిపీట్ చేశారు. ఇద్దరికీ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news