ఓ సినిమా ప్లాప్‌నకు రకరకాల కారణాలు ఉంటాయి. కథ, కథనాలు బాగుండకపోవడం… సరైన కాస్టింగ్ లేకపోవడం.. హీరోయిన్ సెట్‌కాక.. హీరో క్యారెక్టరైజేషన్ కుదరక.. సాంగ్స్ సరిగా లేక… బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్‌గా ఉండడం.. ఎడిటింగ్ లోపం, రన్ టైం ఎక్కువుగా ఉండడం.. కామెడీ సెట్ కాకపోవడం.. ఎమోషన్ పండకపోవడం ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. అయితే విచిత్రంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్లాప్ కావడానికి సౌండ్ కారణంగా నిలిచింది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
బాలయ్య హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో కృష్ణబాబు సినిమా వచ్చింది. చండి అడ్డాల ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాకు చంటి అనుకున్న లైన్‌కు తర్వాత స్క్రిఫ్ట్ దశకు వచ్చిన లైన్‌కు తేడా వచ్చేసింది. అయితే అప్పట్లో ఫ్రింట్ సిస్టమ్ ఉండడంతో ఫ్రింట్లు తయారు చేసేటప్పుడు ఆ మెషిన్‌లో ఓ పిన్ ఇరుక్కుపోయింది. దానిని ఎవ్వరూ గమనించలేదు. చివరకు అన్ని ఫ్రింట్లలో రీల్‌పై ఆ పిన్ ఓ గీతలా గీసుకుంటూ వచ్చేసిందట.
తీరా రిలీజ్ అయ్యాక చూస్తే అసలే సినిమాకు అంతంత మాత్రం టాక్ ఉంది. రీల్ అంతా గీత పడడంతో థియేటర్లలో సౌండ్ తేడా కొట్టేసింది. డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత చంటికి ఫోన్ చేసి ఈ సౌండ్ ఏంటండి.. అస్సలు మాట వినపడడం లేదు.. అంతా బుర్ బుర్ మంటోందని చెప్పడంతో చంటి షాక్ అయ్యారట. చివరకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి, చంటి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అన్ని థియేటర్లు తిరిగాక కాని తేడా ఎక్కడ వచ్చింది అన్నది కనిపెట్టలేకపోయారట.
అయితే సినిమాకు అంతంత మాత్రం టాక్ రావడంతో పాటు సౌండ్ సరిగా లేదన్న టాక్ రావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సౌండ్ ట్రాక్ సరిగా ఉండి ఉంటే కృష్ణబాబుకు మరింత మెరుగైన వసూళ్లు వచ్చి ఉండేవని నిర్మాత చంటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ బంగారం ప్లాప్‌నకు చాలా కారణాలు ఉండగా.. అందులో సౌండ్ కూడా మరో ప్రధాన కారణం. అసలు ఈ సినిమాలో పవన్‌కు హీరోయిన్ ఉండదు… రాజాను ప్రేమించిన మీరా చోప్రా కోసమే బీబీసీ రిపోర్టర్‌గా ఉన్న పవన్ ఫ్యాక్షనిస్టులతో తలపడతాడు.
ఓ హీరోయిన్… అది కూడా తనకు జోడీగా ఉన్న హీరోయిన్ కోసం కాకుండా హీరోయిన్ మరో వ్యక్తిని ప్రేమిస్తే అతడిని కలిపేందుకు హీరో తన బీబీసీ లక్ష్యం కోల్పోవడం జనాలకు నచ్చలేదు. తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించడంతో థియేటర్లలో ఈ మూవీ అరుపులు, కేకలు జనాలకు పిచ్చెక్కించేశాయి. కఠోరమైన సౌండ్ సిస్టమ్‌తో సినిమా చూసిన ప్రేక్షకుడు పిచ్చెక్కిపోయాడు. అసలు ఇదేం సౌండ్ రా బాబు అని జనాలు తలలు పట్టుకున్నారు.
సినిమాకు విద్యాసాగర్ అందించిన పాటలు బాగున్నా.. సౌండ్ ఇంజనీర్ ఫెయిల్యర్ కారణంగా సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఇక అనేక కారణాలు ఈ సినిమా ప్లాప్‌నకు కారణమయ్యాయి. అప్పట్లో కేవలం రు. 12 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి కమర్షియల్‌గా ప్లాప్‌గా నిలిచింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సౌండ్‌తో ప్లాప్ అవ్వడం కాస్త విచిత్రమే అనుకోవాలి.