నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా బాక్సాఫీస్ రన్ చాలా డీసెంట్‌గా స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ డీసెంట్‌గానే సినిమా కంటిన్యూ అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఓ వైపు థియేటర్లలో మేజర్, విక్రమ్ రెండు సినిమాలు కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. నాని సినిమాకు మంచి టాకే వచ్చినా సినిమా చాలా స్లో ఉందని.. రన్ టైం మరీ ఎక్కువన్న కంప్లైంట్లు బాగా వచ్చాయి.
రన్‌టైం ఫస్ట్ డే టాక్ తర్వాత సాయంత్రానికి అయినా ట్రిమ్ చేసుకుని ఉంటే బాగుండేది.. ఈ కంప్లైంట్‌ను మేకర్స్ చాలా లైట్ తీస్కొన్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై గట్టిగా పడింది. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో రు. 15 కోట్ల వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రు. 16 కోట్లు రావాలి. ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. వీక్ డేస్‌లో కూడా సినిమాకు శని, ఆదివారాల లాగానే వసూళ్లు వస్తేనే సినిమా సేఫ్ అవుతుంది.
సినిమాను పని కట్టుకుని ఓ వర్గం ఫ్యాన్స్ ఎందుకో యాంటీగా ప్రచారం చేస్తున్నారు. సినిమా బాగున్నా పెద్దగా ఉందని.. రన్ టైం 3 గంటలు అంటే భరించడం కష్టం అని కొందరు అంటున్నారు. ఏదేమైనా మేకర్స్ ముందుగా వచ్చిన రన్ టైంను ఓ 15 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే మెరుగైన ఫలితం వచ్చేది. ఇప్పటకీ అయినా ఈ కంప్లైంట్‌పై దృష్టి పెట్టకపోతే సినిమా బండి ఈదడం కష్టంగానే ఉంది.
ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – రూ. 4.54 కోట్లు
సీడెడ్ – రూ. 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.15 కోట్లు
ఈస్ట్ – 84 లక్షలు
వెస్ట్ – 73 లక్షలు
గుంటూరు – 80 లక్షలు
నెల్లూరు – 53 లక్షలు
కృష్ణా – 74 లక్షలు