ఆది పినిశెట్టి..టాలీవుడ్, కోలీ వుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్న ఈయన ..కొద్ది రోజులు క్రితమే..తన దిల్ కి ధడకన్..ప్రియ ప్రేయసి..హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని తెలిసినా..అది అంతా పుకార్లే అని కొట్టిపారేశారు జనాలు. ఆది చాలా సైలెంట్ అని..ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడపడని..చెప్పుకొచ్చే వారు. కానీ, వన్స్ ఆయన నిశ్చితార్ధపు ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాక..కధ మారిపోయింది. ఈ ప్రేమ అనే దోమ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అని ఫనీ గా జోక్స్ వేస్తూ..కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు.
కాగా, 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరు కలిసి జంటగా నటించే టైంలో వీళ్ల మనసులు కలిశాయట. కానీ, అది ప్రేమో కాదో తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది అని..ఆ తరువాత..ఇంట్లో వాళ్లను ఓప్పించి..కెరీర్ లో సెటిల్ అయ్యాక ఇప్పుడు పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. జంటగా నటించారు. ఆది,నిక్కి మే 18న సాంప్రదాయ పద్ధతిలో చెన్నైలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీళ్ల పెళ్లికి పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా హజరయ్యారు. వీళ్ల పెళ్ళికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే వచ్చాయి.
కాగా, ప్రజెంట్ ఈ హీరో తీసుకున్న కట్నం విషయం నెట్టింట హాట్ తాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆది ..నిక్కి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కానీ, కట్నం కూడా బాగానే పుచ్చుకున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే, ఆది సన్నిహితులు మాత్రం, ఒక్క రూపాయి తీసుకోలేదు..ఆది కట్నానికి వ్యతిరేకం..ఆది ,నిక్కి ని ఎంతో ప్రాణంగా ప్రేమించి..ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మాటలతో సినీ పెద్దలు కూడా ఆది మంచితననైకి, క్యారెక్టర్ కి ఫిదా అవుతున్నారు. పెళ్ళి చేసుకుని అదనపు కట్నం కోసం వేధించే మగాళ్లు ఉన్న ఈ రోజుల్లో ఆది లాంటి వాళ్ళు కూడా ఉండటం గ్రేట్ అంటూ అమ్మాయిలు పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం ‘వారియర్’ మూవీలో విలన్గా నటిస్తున్నాడు.