టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ది విభిన్నమైన మనస్తత్వం. ఆయనలో ఎక్కువుగా వేదాంత ధోరణి కనిపిస్తూ ఉంటుంది. వెంకటేష్ చాలా సింపుల్‌గా ఉంటారు. వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవుల నుంచి నేటి వరకు ఎన్ని హిట్లు వచ్చినా కూడా తాను స్టార్, సీనియర్ హీరోను అన్న గర్వం వెంకటేష్‌లో ఇసుమంత అయినా కనిపించదు. తన కెరీర్‌లో వెంకీ ఎంతోమంది హీరోయిన్లతో నటించినా కూడా ఏనాడు చిన్న రూమర్ కూడా వెంకటేష్‌పై రాలేదు.
బాలకృష్ణ అనుస్టాపబుల్ ప్రోగ్రాంలో అన్నట్టు సినీ ఇండస్ట్రీలో స్వామి వివేకానంద లాంటి వాడు వెంకటేష్. ఇక వెంకటేష్ భార్య పేరు దగ్గుబాటి నీరజ. ఆమెకు బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నీరజ కుటుంబానికి పొలిటికల్ నేపథ్యం కూడా ఉంది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఓ బాబు జన్మించాడు. నీరజ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి.
వీళ్లది అక్కడ పెద్ద జమిందారి కుటుంబం. వెంకటేష్‌కు పెళ్లి చేయాలని రామానాయుడు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని విజయా నాగిరెడ్డి గారికి చెప్పారట. నాగిరెడ్డి ద్వారానే నీరజ కుటుంబం గురించి తెలుసుకున్న రామానాయుడు నీరజతో వెంకటేష్‌కు పెళ్లి చేశారు. ఇక నీరజ వాళ్ల అమ్మమ్మ గారి ఊరు కృష్ణాజిల్లా కైకలూరు ( ఇప్పుడు ఏలూరు జిల్లా) దగ్గర ఉన్న వరాహపట్నం. వీరిది కూడా సంపన్న కుటుంబమే.
నీరజ చదువుకునే రోజుల్లో సెలవులకు అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి అక్కడే ఉండేదట. ఇక నీరజ మేనమామ ఎవరో కాదు మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు. ఆయన టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తర్వాత 2014 ఎన్నికల్లో కైకలూరు నుంచి బీజేపీ తరపున గెలిచి చంద్రబాబు కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నీరజ మేనమేమ గెలుపుకోసం ప్రచారం కూడా చేశారు.
ఇక నీరజ మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో పదో తరగతి పూర్తి చేశారు. తర్వాత మదనపల్లి వీ.టి కాలేజీలో చదువుకున్నారు. నీరజా ఎంబీఏ పూర్తి చేశారు. 1989లో నీరజ – వెంకటేష్ పెళ్లి జరిగింది. అయితే నీరజతో పాటు వెంకీ పిల్లలు ఎప్పుడూ బయటకు రారు. సినిమా ఫంక్షన్లకు కూడా వీరు దూరంగా ఉంటారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరోల పెళ్లిళ్లు జరిగినప్పుడు మాత్రమే వెంకటేష్.. తన భార్యతో కలసి వచ్చి ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి.