మహేష్‌బాబుతో నటించిన లేటెస్ట్ హిట్ సర్కారు వారి పాట సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఎక్కువుగా ఓటీటీ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే సర్కారు వారి పాట సినిమాలో ఆమె చేసిన కళావతి రోల్ ఆమె రేంజ్‌కు తగ్గ రోల్. మళ్లీ యూత్‌కు ఈ రోల్‌తో కీర్తి బాగా కనెక్ట్ అయ్యింది. మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఆమె రేంజ్, క్రేజ్ కూడా తగ్గిపోయింది.
సర్కారు వారి పాట సినిమా బాగా ఎంజాయ్ చేస్తోన్న కీర్తి వరుసగా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఓ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను మహానటి అని పిలిచేవారని.. ఇప్పుడు అందరూ కళావతి అని పిలుస్తున్నారని చెప్పింది. ఈ కళావతి సాంగ్‌లో కీర్తి క్లాసికల్ గా కనిపించినా.. సాంగ్స్ లో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం కీర్తి నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ మై విలేజ్ షోలో భాగంగా యూట్యూబర్లతో ముచ్చటించింది. అనిల్ మహేష్‌తో మాట్లాడుతూ మిమ్మలను అందరూ సార్ సార్ అని పిలుస్తున్నారు.. నేను మాత్రం అన్నా అని పిలుచుకుంటానని అడిగాడు. వెంటనే మహేష్ ఏంటి చెప్పు తమ్ముడు అని సరదాగా మాట్లాడాడు. అనంతరం మహేష్‌ను పొగుడుతూ ఓ పద్యం పాడాడు.
అనంతరం అనిల్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఉద్దేశించి కీర్తి వదిన అన్న వెంటనే మహేష్ లైన్లోకి వచ్చేసి కాదమ్మా నువ్వేంటి అందరిని వరుసలు కలిపేసుకుంటున్నావు.. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అని చమత్కరించాడు. వెంటనే అనిల్ కీర్తితో వరుస మార్చేస్తూ కీర్తి అక్కా అని పిలిచాడు. అప్పుడు కూడా మహేష్ అక్కా ఏంటమ్మా ? కీర్తి అని పిలువు అని చెప్పడంతో అనిల్ మాత్రం కీర్తి అక్కా అంటూనే సంబోధించాడు. ఈ సంభాషణ అందరిని సరదాగా ఆకట్టుకుంది.