భారీ అంచనాలతో వచ్చిన మెగాస్టార్ ఆచార్య సినిమా అంచనాలను తల్లకిందులు చేస్తూ డిజాస్టర్ అయ్యింది. తొలి రోజు మిక్స్ డ్ టాక్ ఉన్నా ఫస్ట్ వీకెండ్‌కు అయినా పుంజుకుంటుందని ఆశించిన వారి ఆశలు అడియాసలు అయిపోయాయి. సినిమాకు భారీ నష్టాలు తప్పవనే అంటున్నారు.
డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా నైజాం రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను నైజాంలో అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. వరంగల్ శ్రీను ఇటీవల ఆచార్య నైజాం రైట్స్ ను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
నైజాంలో కాకలు తీరిన పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లను కాదని మరీ పోటీకి వెళ్లి వరంగల్ శ్రీను ఆచార్య రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రైట్స్ పబ్లిసిటీతో కలుపుకుని మొత్తం రు. 42 కోట్లకు వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నాడు. మనకు వినిపిస్తోన్న టాక్ ప్రకారం 50 శాతం నష్టాలు అంటే రు. 21 కోట్లకు పైగానే శ్రీను నష్టపోతాడని అంటున్నారు. ఇప్పటికే ఈ మొత్తం ఖర్చు పెట్టేసి ఉండడంతో వరంగల్ శ్రీను బాగా కుదేలైపోయాడు.
అయితే దర్శకుడు కొరటాల శివ శ్రీనుకు స్వయంగా ఫోన్ చేసి తాను నెక్ట్స్ ఎన్టీఆర్‌తో తీసే సినిమా రైట్స్ నీకు ఇచ్చేలా చేయడంతో పాటు ఆ సినిమాలో ఈ నష్టాన్ని భర్తీ చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక అంతకంటే ముందు విజయ్ దేవరకొండ – పూరి కాంబోలో వచ్చిన లైగర్ సినిమా రైట్స్ కూడా శ్రీను దక్కించుకోవడంతో ఆ సినిమా హిట్ అయినా శ్రీను కొంత వరకు సేఫ్ అవుతాడు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి ఫామ్‌లో ఉండడంతో పాటు పాన్ ఇండియా లెవల్లో వస్తోన్న లైగర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి లైగర్ ఏం చేస్తుందో ? వరంగల్ శ్రీనును ఎంత వరకు కాపాడుతుందో ? చూడాలి.